24 మందితో జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరమ్ (ఏపీజెఎఫ్) తిరుపతి జిల్లా అధ్యక్షునిగా అరవ జయపాల్, ప్రధాన కార్యదర్శిగా నత్తం హరిబాబు లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నుకున్నారు. సోమవారం తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ హాల్ లో జరిగిన ఆ సంఘం సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దినేని హరిబాబు ఆధ్వర్యంలో వారిని ఎన్నుకున్నారు నిర్ణయించారు. అలాగే జిల్లా ఉపాధ్యక్షునిగా, కమిటీ సమన్వయకర్తగా పీటర్ ప్రసాద్ ను, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ప్రసాద్, ట్రెజరర్ గా బి. శ్రీనివాస ప్రసాద్, సెక్రెటరీగా గళ్ళా మహేష్ లను ఎంపిక చేశారు. ఉపాధ్యక్షులుగా జి. దామోదరం, సోమశేఖర్, జి. రాజేష్, భాస్కర్, ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ లుగా వెంకటేష్, శ్రీనివాసులు, వెంకయ్య, వి. అశోక్ సాయి, హరి బాబు లను ప్రకటించారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా బి. ప్రకాష్, వెంకటాద్రి, కుశాల్, హరిబాబు, జి. చంద్రశేఖర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దినేని హరిబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ, జర్నలిస్టుల ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. జర్నలిస్టులు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని మీడియా అందిపుచ్చుకోవాలని సూచించారు. అర్హులందరికీ అక్రిడేషన్లు, ఇంటి స్థలాలు ఇప్పించడానికి, గృహ నిర్మాణం కోసం కృషి చేస్తామని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ఫోరమ్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. సంఘం ఆశయాలకు అనుగుణంగా, జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి కోసం నూతన కమిటీ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. జిల్లాలో జర్నలిస్టుల సమ‌స్యలపై పోరాడేందుకు అండగా నిలుస్తామని వెల్లడించారు. నూతన కమిటీని ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.