ప్రభాతదర్శిని( గూడూరు ప్రతినిధి): వైసీపీ బలోపేతానికి తన వంతు కృషిచేసి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంతవరకు అహర్నిశలు కృషి చేస్తారని నూతనంగా ఎన్నికైన జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షులు ఊ టుకూరు యామిని రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, తనదైన ముద్ర వేస్తున్న యువ నాయకురాలు ఊటుకూరు యామిని రెడ్డి గారికి పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. నెల్లూరు జిల్లా వైసీపీ మహిళా విభాగ వైస్ ప్రెసిడెంట్గా ఆమె నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల జిల్లాలోని మహిళలు మరియు పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే నెల్లూరు జిల్లా విభాగ మహిళా వైస్ ప్రెసిడెంట్ దక్కించుకోవడం యామిని గారు పార్టీకి చేసిన నిరంతర సేవలకు నిదర్శనం. పార్టీ పట్ల ఆమెకున్న నిబద్ధతను గుర్తించి అధిష్టానం ఈ బాధ్యతను కట్టబెట్టింది. పార్టీలోని కీలక సీనియర్ నాయకులతో మరియు అధిష్టానంతో ఊటుకూరు యామిని రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందరినీ కలుపుకుని పోయే స్వభావం పార్టీ బలోపేతానికి తోడ్పడుతోంది. జిల్లాలో మహిళలను పార్టీ వైపు ఆకర్షించడంలో, వారిని చైతన్యపరచడంలో యామిని ఎప్పుడూ ముందుంటారు. ఏ కార్యక్రమమైనా తనదైన శైలిలో విజయవంతం చేస్తూ నాయకత్వ ప్రశంసలు అందుకుంటున్నారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.