మీడియా ముసుగులో కమీషన్లకు కక్కుర్తిపడి సిఫారసులు చేసిన దళారులు
ఈవో గారు… పిఆరఓ ఎందుకు ఉన్నట్లు ?
వార్తలు కవర్ చేసే రిపోర్టర్ల ఎవరో తెలుసుకోలేని దుస్థితిలో ఈవో ఉన్నారా?

(నన్నూరు.శ్రీనివాసరావు, ఎడిటర్, ప్రభాతదర్శిని): శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాల ప్రకటనల జారీలో కొత్త విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలకు పబ్లిసిటీ కోసం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రకటనలు (యాడ్స్) జారీ చేసే విషయంలో స్థానికంగా ఉన్న ప్రెస్ కమిటీ సభ్యులు కన్ను సన్ననలో కార్యనిర్వాహణ అధికారి ప్రకటనలు మంజూరు చేసినట్లు విమర్శలు ఉన్నాయి. ప్రెస్ క్లబ్ సభ్యులు చెప్పినట్లు బ్రహ్మోత్సవాల ప్రకటనలు ఇవ్వ డంతో, శ్రీకాళహస్తీలో ఉండి దేవస్ధానం స్వామివారి కార్యక్రమాలను కవర్ చేస్తున్న మీడియా సంస్థ ప్రతినిధుల విన్నపాలను ఎందుకు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో అని ప్రశ్నలు ఉత్పన్నమ వుతున్నాయి.ప్రెస్ క్లబ్ సభ్యులు చెప్పినట్లు బ్రహ్మోత్సవాల ప్రకటనలు మంజూరు చేస్తే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎందుకు ఉన్నట్లో? అనే విషయంపై ఈవో సమాధానం ప్రకటించడలసి ఉంది. శ్రీకాళహస్తి లో మీడియా ముసుగులో కొందరు ప్రెస్‌క్లబ్ వేదికగా ప్రెస్‌క్లబ్ పై ఆధిపత్య పోరుకోసం విలేకరులు రెండు వర్గాలుగా విడిపోయి ఉన్నారు. శ్రీకాళహస్తిలో తమ ఉనికిని చాటుకునే క్రమంలో ముఖ్యంగా తమకు ఆర్ధిక వనరు అయిన శ్రీకాళహస్తీస్వామి వారి దేవస్ధానంలో కమీషన్ల దందాకు తెరలేపినట్లు సమాచారం.మీడియా ముసుగులో ఉన్న వ్యక్తులు ఈవో బాపిరెడ్డికి భజన చేస్తూ తమ పదం జరుపుకు న్నేందుకు జుగుప్సాకరమై పనలు చేస్తు విధంగా వెకిలి చేష్టాలతో తాము విలేకరులు అన్న విషయాన్ని మర్చిపోయి, ఇతర విలేకరుల ను చులకచేసి మాట్లడడం, పిల్లచేష్టాలతో చాడికోర్లుగా అవతారమెత్తి ఇతరుల వద్ద వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఆధిపత్య పోరులో బాగంగా బ్రహ్మోత్సవాల ప్రకటనల కోసం కార్యాలయానికి మీడియా సంస్థల యాజమాన్యాలు లెటర్ ఇస్తే స్థానికంగా పనిచేసే విలేకరుల తో ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకొని ఈ పేపర్లు ఎక్కడున్నాయి వీటిని ఎవరు చూస్తారు అని రీతిలో ఈవోకు చాడిలు చెప్పి తప్పుదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ చాడికోర్లు చెప్పే మాటలలో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో, వీరు పనిచేస్తున్న మీడియా సంస్ధల పరిస్ధితి స్థాయి ఏమిటో తెలుసుకోలేని దుస్థితిలో ఈవో బాపిరెడ్డి వ్యవహరించడం శోచనీయం. ఈవో వింతవైఖరితో సంవత్సరాలపాటు శ్రీకాళహస్తి కేంద్రంగా స్వామివారి వార్తలు కవర్ చేస్తున్న పలు మీడియా సంస్థల రిపోర్టర్లు బ్రహ్మోత్సవాల ప్రకటనలు కోల్పోయారు. శ్రీకాళహస్తిలో పనిచేయని వ్యక్తులకు, స్వామివారి కార్యక్రమాలుపై వార్తలు రాయిని సంస్థలకు వేలాది రూపాయల ప్రకటనను మీడియా ముసుగులో ఉన్న చాడీగోర్లు పర్సంటేజ్ తీసు కొని రికమండేషన్ చేసివారికి యాడ్లు ఇప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్వామివారి కార్యక్రమాలను ఏఏ పత్రికలు రిపోర్టర్లు స్థానికంగా ఉండి కవర్ చేస్తున్నారో అనే విషయం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కు స్పష్టంగా తెలిసిన, మీడియా ముసుగులో దళారులుగా ఉన్న చాడికోరు ఆగడాలకు భయపడి పిఆరఓ కూడా నోరు మెదప లేకపోయారని తెలుస్తోంది. శ్రీకాళహస్తిశ్వర స్వామి వారి సమాచారం ను స్థానిక రిపోర్టర్‌గా ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి రోజువారి సమాచారంను గ్రూపులో వివరి స్తుంటారు.ఆ గ్రూపులో ఏఏ పత్రికకు ఎవరెవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో? ఎవరెవరు దేవస్థానానికి సంబంధించిన వార్తలు రాస్తున్నారో అన్న విషయం గ్రూపు సభ్యులకు అందులో ఉన్న అధికా రులకు ప్రతి ఒక్కరికి తెలుసు. కనీసం దీనిని ప్రతిపాదిక తీసుకున్న స్వామివారి కార్యక్రమాలు కవర్ చేస్తున్న మీడియా సంస్థలు విలేకరులు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. వీటి ఆధారంగా తీసుకుని యాడ్స్ ఇవ్వవచ్చు. వీటిని పక్కనపెట్టి ప్రెస్ క్లబ్ సభ్యులుగా చలామణి అవుతున్న వ్యక్తులు ఈవో వద్ద పైరవీలు చేసి స్వామివారి కార్యక్రమాలుపై వార్తలు రాయిని సంస్థలకు యాడ్స్ ఇప్పించే విషయంలో పర్సంటేజ్ కోసం కక్కుర్తిపడి ఈవో బాపిరెడ్డిని తప్పుదారి పట్టించినట్లు విమర్శలున్నాయి. ఈవో ఎవరి మెప్ప్పు కోసం ఇలా చేశారో అన్న విషయంలో ఆత్మవిమర్శ చేసుకుంటారో? లేక ఆత్మ వంచన చేసుకుంటారో ఆయన వ్పు్ఞితకే వదిలి వేద్దాం.ప్రెస్ క్లబ్ సభ్యులు అడుగులకు అడుగులు వేస్తున్న ఈవో బాపిరెడ్డి మధ్య ఉన్న లోగుట్టు ఏమిటో ఆ పెరుమాళ్ళకే ఎరుక.