తిరుపతి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
ప్రభాతదర్శిని, (తిరుపతి – ప్రతినిధి): ఈ నెల 23 వ తేదీ శుక్రవారం ఎస్. సి/ఎస్. టి సమస్యల పై ప్రత్యేక పి. జి. ఆర్. ఎస్ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని ఈ కార్యక్రమానికి పోలీస్, అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికారులందరు హాజరు కావాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా, రెవెన్యూ డివిజన్, మండల, తదితర అధికారులతో వర్చువల్ గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక పి. జి. ఆర్. ఎస్ అర్జీలు పరిష్కారంపై జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్, మున్సిపల్ కమిషనర్ ఎన్. మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్సీ, డి ఆర్ ఓ నరసింహులు తో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా రీ ఓపెన్ కి ఆస్కారం లేకుండా నాణ్యతతో పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని పి. జి. ఆర్. ఎస్ లో వచ్చిన అర్జీలను నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని, ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు. పరిష్కారo చూపలేని అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని, తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వరాదని ఆదేశించారు. రీ ఓపెన్ కి తావు లేకుండా పరిష్కారం చూపాలని అన్నారు. ప్రతి సోమవారం అన్ని మండల పరిధిలో, డివిజన్ పరిధిలో తప్పని సరిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించాలని, ఈ కార్యక్రమం నిర్వహించు ప్రదేశం, సమయం అర్జిదారులకు తెలిసేలా సమాచారం ఇవ్వాలి అని అన్నారు. అర్జీదారులు వారి సమస్యకు పరిష్కారం కొరకు పీజీఆర్ఎస్ కు రావడం జరుగుతుందని సంబంధిత అధికారులు అర్జీ దారునితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను సావధానoగా విని సంతృప్త స్థాయిలో పరిష్కారo చూపాలని అన్నారు. అర్జీలు బియాండ్ ఎస్ ఎల్ ఎ కు వెళ్లకుండా రోజువారీగా అర్జీలను రిఓపెన్ చేసి చూసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తప్పుడు ఎండార్స్ మెంటు లేకుండా చూడాలని అన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఐ. వి. ఆర్ . ఎస్, పి 4, సర్వే, టెంపుల్, హెల్త్ తదితర అంశాల పై అధికంగా పిర్యాదులు వస్తున్నందున సంబందిత సచివాలయ సిబ్బంది ఐ. వి. ఆర్. ఎస్. పైన అవగాహన కలిగి ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని, ఎటువంటి పిర్యాదులు రాకుండా చూడాల్సిన బాద్యత సంబందిత శాఖల వారిదేనని సూచించారు. మార్చి 16 వ తారీఖు నుండి ప్రారంభం కానున్న 10 వ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు వచ్చేలా విద్యార్థిని విద్యార్థులకు జిల్లాలోని ఉపాద్యాయులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని అందరూ తహశీల్దారు లు రీ సర్వే అయిన గ్రామాలలో ప్రతి నెల 2 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు పట్టాదారు పాసు పుస్తకాలను ఈ. కె. వి సి ద్వారా అందించాలని అన్నారు. సిబ్బంది కొరత ఉన్నచో సంబందిత మండల ఎం. పి. డి. ఓ ల సిబ్బందిని ఉపయోగిoచుకోవాలని సూచించారు. ఈ నెల 23 వ తేదీన ఉద్యోగస్థు ల పరిష్కార వేదిక సాయంత్రం 4 గంటలకు నిర్వహించడం జరుగుతు౦దని, ఉద్యోగుల సమస్యలకు సంబందించిన అంశాలను పరిష్కారం కొరకు ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతుందని కావున జిల్లా అధికారులు, సంబందిత సెక్షన్ అధికారులు తప్పక హాజరై ఉద్యోగస్తు ల పై మోపబడిన అభియోగలకు సంబందించిన పత్రాలను తీసుకురావాలని అన్నారు. ఈ సమావేశంలో తిరుపతి ఆర్. డి. ఓ రామ్మోహన్, డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ రోస్మాండ్, డ్వామా పి. డి శ్రీనివాస ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ రావు, డి. ఈ. ఓ కుమార్,ల్యాండ్ అండ్ సర్వే అధికారి అరుణ కుమార్ సంబందిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
