ప్రభాతదర్శిని (ప్రత్యేక ప్రతినిధి): తడ కేజీబీవీ పాఠశాల విద్యార్థిని వెంకటలక్ష్మి మానవత స్వచ్ఛంద సేవ సంస్థ తిరుపతి శాఖ చైర్మన్ భార్గవ, విద్యా కార్యదర్శి విశ్రాంత ఆచార్యులు ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, కే ఆర్ లోకేష్ లు తిరుపతి బర్డ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో పదివేల రూపాయలు సహాయం అందజేశారు. ఇందులో 5000 రూపాయలు నగదు రూపంలోనూ, మరో ఐదు వేల రూపాయలు ఆ బాలికకు సంబంధించిన సామాగ్రిని అందజేసినట్లు వారు తెలిపారు. గాయపడిన విద్యార్థిని కి ఆర్థికంగా చేయుత అందించిన మానవత స్వచ్ఛంద సేవ సంస్థ కార్య నిర్వాహకులను జిసిడిఓ పుష్ప అభినందించారు.