ప్రభాతదర్శిని (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేటలో న్యూ మైత్రి షాపింగ్ మాల్ ను సినీ హిరోయిన్ పాయల్ రాజ్ పుత్, అనసూయ లు ప్రారంభించారు. నిర్వాహుకులు మహేష్, మోహిత్, యుగంధర్ వారికి స్వాగతం పలికి సత్కరించారు.అందాల తారల రాకతో చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. షాపింగ్‌ మాల్‌ వద్ద సందడి నెలకొన్నది.ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ అధునాతన కలెక్షన్స్‌తో నిత్య నూతన వెరైటీలతో పేరుగాంచే విధంగా మైత్రి షాపింగ్ మాల్ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.నాయుడుపేటలో షాపింగ్ మాల్ ను ప్రారంభించడం తనకు ఆనందంగా ఉంద‌ని తెలిపారు.యువత పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.