ప్రభాతదర్శిని (నెల్లూరు -ప్రతినిధి): చిల్లకూరు మండలం నక్కలకాల్వ కండ్రిగ గ్రామ పరిధిలో ఉన్న ఏపీఐఐసీ భూములపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి కోరారు. నెల్లూరులో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ అంశాన్ని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దిశ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రస్తావించారు. దీనికి స్పందించిన ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మాట్లాడుతూ, 2010లో ఈ భూమి సీలింగ్ భూమిగా గుర్తించబడిన నేపథ్యంలో మొత్తం 54.50 ఎకరాలను ప్రభుత్వం ఏపీఐఐసీకి కేటాయించిందని తెలిపారు అనంతరం కొంతమంది వ్యక్తులు ఈ భూమిపై కోర్టును ఆశ్రయించినప్పటికీ.ఈ భూమి ప్రభుత్వానిదేనని కోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చిందని వివరించారు అదనంగా, ప్రభుత్వం ఏపీఐఐసీకి కేటాయించిన భూమిని పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించవచ్చని కోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు. 2025లో సుమారు 40 ఎకరాల భూమిని కొన్ని కంపెనీలకు రిజిస్టర్ చేయడం జరిగిందని, మిగిలిన భూమిని కూడా త్వరలో పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా నక్కలకాల్వ కండ్రిగలోని 54.50 ఎకరాల భూమి పూర్తిగా ఏపీఐఐసీ ఆధీనంలోనే ఉందని, ఈ భూమికి ప్రైవేట్ వ్యక్తులతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టంచేశారు. ఈ సమావేశంలో బీద మస్తాన్ రావు , ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ,సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, నెల్లూరు ఇంచార్జ్ మేయర్,దిశా కమిటీ సభ్యులు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
