ప్రభాతదర్శిని (నాయుడుపేట -ప్రతినిధి): రైతులు అభివృద్దే ధ్యేయంగా నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధి లోని పనిచేస్తామని ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ అన్నారు. మంగళవారం స్థానిక ఏఎంసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.గ్రామీణ ప్రాంతాల్లో లింకు రోడ్ల నిర్మాణాలకు అవసరమైన నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరంలో ఏఎంసి ఆదాయ లక్ష్యాన్ని చేరుకునేందుకు కమిటీ సభ్యులు, ఏఎంసీ అధికారులు సిబ్బంది సహకరించాలని కోరారు. అనంతరం ఏఎంసీ కమిటీ సభ్యులకు గౌరవ వేతనం చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ కిలారి గోపాలకృష్ణ,పలువురు కమిటీ సభ్యులు,ఏఎంసి అధికారులు పాల్గొన్నారు.