ప్రభాతదర్శిని (నెల్లూరు -ప్రతినిధి): మానవ సేవే మాధవ సేవ అన్నది విపిఆర్ ఫౌండేషన్ నినాదం అన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరు మాగుంట లేఔట్ లోని ఆమె నివాసంలో బుచ్చిరెడ్డిపాలెం మండలం రామచంద్రాపురం, ఇందుకూరుపేట మండలం లేబూరు గ్రామానికి చెందిన దివ్యాంగులకు 2 ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ అందజేశారు . నడవలేని దివ్యాంగులలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే లక్ష్యంతో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత బ్యాటరీ ట్రై సైకిళ్ళు అందచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 11 వందల ట్రై సైకిల్స్ అందజేశామని కోవూరు నియోజకవర్గంలో దాదాపు 200 మందికి ఈ బ్యాటరీ ట్రై సైకిల్స్ ఇచ్చినట్టు ఆమె స్పష్టం చేశారు. ట్రై సైకిల్స్ అందుకున్న దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వే తమకు కోట్ల రూపాయలతో సమానమన్నారు. ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ ద్వారా దివ్యాంగులు ఎవరి సాయం లేకుండానే బయటకు వెళ్లి స్వయం ఉపాధి పొందగలరన్నారు. ఆత్మ విశ్వాసానికి వైకల్యము అడ్డుకాదని నిరూపించాలని ఆమె దివ్యాంగులను కోరారు.