ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) 2025-26 విద్యా సంవత్సరానికి నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు కెవిఎన్ కుమార్, సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి గౌరీ శంకర్రావు లు ఒక తెలిపారు. తాత్కాలిక, ఔట్సోర్సింగ్ విధానం లో 32 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పోస్టులన్నీ మహిళా అభ్యర్థులకు కేటాయించామన్నారు. టైప్-3 విభాగంలో ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్ 3, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ 2, అటెండర్, అసిస్టెంట్ కుక్, స్కావెంజర్ ఒక్కొక్కటి వంతున ఖాళీలున్నాయని తెలిపారు. టైప్-4లో వార్డెన్ 3, పార్టెమ్ టీచర్ 4, చౌకిదార్ 4, హెడ్బుక్ 4, అసిస్టెంట్ కుక్ 8 ఏఎన్ఎం 1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. వార్డెన్ పోస్టులకు డిగ్రీతో పాటు బీఈడీ, టీచర్ పోస్టులకు బీఎస్సీ మ్యాథ్స్ తో పాటు బీఈడీ, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు ఇంటర్ పాటు కంప్యూటర్ కోర్సు అర్హతగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కుక్, అసిస్టెం ట్ కుక్, చౌకిదార్, అటెండర్ తదితర పోస్టులకు నిరిష్ట అర్హతలేదని అనుభవం అవసరమని తెలిపారు. తిరుపతి జిల్లా లోని టైప్ -3 కేజీబీవీ పెనగలూరు, ఓబులవారిపల్లి, చిట్వేలు, పుల్లంపేట లలో ని ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ 4, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ 3,ఎఎన్ఎం 3, అటెండర్ 1, అసిస్టెంట్ కుక్ 5, స్కావెంజర్స్ 3 మొత్తం 19 ఖాళీలను మరియు టైప్ -4 కేజీబీవీ (Model schools) పార్ట్ టైం టీచర్ 1, చౌకీదారు 1, అసిస్టెంట్ కుక్ 1 మొత్తం 3 వాటికి కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 3 నుంచి 11వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సమగ్ర శిక్షా కార్యా లయం, తిరుపతి లో సమర్పించాలని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో మండలాన్ని యూనిట్ గా తీసుకుని కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి ఎంపిక కమిటీ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి, ఈనెల 28వ తేదీన మెరిట్ జాబితాను విడుదల చేస్తామ న్నారు. ఎంపికైన అభ్యర్థులు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విధులకు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం తిరుపతి జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారి మరియు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష 9985939029 ఈ నెంబర్ ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించారు.