ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి): అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం యం. అలమంద గ్రామసచివాలయం లో విధులు నిర్వర్తిస్తున్న గ్రామ రెవిన్యూ అధికారి చుక్క సూర్య నారాయణ లంచం తీసుకుంటూ ఎ.సి.బి.కు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. అదే మండలం లోని పెదనందిపల్లి గ్రామానికి చెందిన యస్. అమ్మతల్లి నాయుడు బావ వ్యవసాయ భూమి మ్యుటేషన్ చేసి ఈ-పాస్‌బుక్ ఇవ్వడానికి రూ.20,000/-లు మేరకు లంచం డిమాండ్ చేసినట్లు నేరుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యం లో బాదితుని తరుపున లంచం డిమాండ్ చేసిన ఉద్యోగి పై ఫిర్యాదు అందుకున్న విశాఖపట్నం ఎ.సి.బి.అధికారులు దాడి చేసి చేసి లంచం స్వీకరిస్తున్న సమయంలో ఆయన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు. అరెస్టయిన సూర్య నారాయణను గురువారం విశాఖ పట్నం లోని ఎ.సి.బి. ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచ నున్నారు.ఇదిలా ఉండగా ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శక మైన పాలనను ప్రభుత్వం చేపడుతూ ఉన్నప్పటికీ ఎక్కడైనా అవినీతి జరుగు తున్నట్లు తెలిసినా వెంటనే ఎ.సి.బి. టోల్‌ఫ్రీ నంబర్ 1064 కు సమాచారం ఇవ్వాలని అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.