

సుపరిపాలనకు తొలి అడుగులో ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ
ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనే సాధ్యమని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. బుధవారం ఓజిలి మండలం కురుగొండ, మానమాల గ్రామాలలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గత వైసిపి పాలనలో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పుల బారిన పడవేశారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక లోటును అధిగమిస్తూ గత ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటే నెరవేర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళుతున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేనిని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఉరవలేక వైసీపీ నాయకులు అభివృద్ధిపై విష ప్రచారాన్ని చేస్తున్నారని ఆమె అన్నారు. వైసిపి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కూటమి నాయకులు తిప్పి కొట్టాలని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రచారం చేస్తూ ప్రజలలోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో చదువుకున్న యువతకి ఉపాధి లేకుండా చేశారని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేసి యువతకు అవస్థ అవకాశాలు కల్పించకుండా పరోక్షంగా అడ్డుకున్నారని ఆమె ధ్వజమెత్తారు. మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ఉనికి కోసం జగన్ పర్యటనపై ప్రగల్పాలు పలుకుతున్నారని ఆయన విమర్శించారు. జగన్ పర్యటనపై తమ పార్టీ నేతలపై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులకు కురుగొండ మానమాల గ్రామాలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కురుగొండ గ్రామంలో టిడిపి నాయకులు గజమాలతో ఎమ్మెల్యేను సత్కరించి, పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. అలాగే మానమల గ్రామంలో టిడిపి మండల ఉపాధ్యక్షులు దువ్వూరు శ్రీనివాసరెడ్డి కలిసి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాలలో ఈ కార్యక్రమంలో ఓజిలి మండలం టిడిపి అధ్యక్షులు గుజ్జులపూడి విజయ్ కుమార్ నాయుడు, మండల కార్యదర్శి దాసరి నిరంజన్, సీనియర్ నాయకులు కంకణాల సత్యవర ప్రసాదరావు, పాడి వెంకటసుబ్బయ్య, కాటూరి కోటేశ్వరరావు, తేను వెంకటేష్, బెల్లం ప్రభాకర్ నాయుడు, పేరంశెట్టి నాగయ్య, మైనార్టీ సెల్ నాయకులు అల్లా బక్షు, ఎస్కే ఖలీల్, ఈశ్వర్ రాజు, గున్నంరెడ్డి మధుసూదన్ రెడ్డి, వెంకటేశ్వర్ల నాయుడు, అలిమిలి మల్లికార్జున్ రెడ్డి, నన్నూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.