ప్రభాతదర్శిని, (హైదరాబాద్-ప్రతినిధి): ఇటీవల ప్రమాదానికి గురై, శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్ లోని వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డిని సోమవారం ఎంఆర్పియఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లాని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని మందకృష్ణ మాదిగ ఆకాంక్షించారు.