జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి శ్రావణి రెడ్డి
ప్రభాతదర్శిని,(గూడూరు – ప్రతినిధి):రెవెన్యూ సదస్సులతో దీర్ఘ కాలిక భూ సమస్యలకు పరిష్కారం పేదప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తిరుపతి పార్లమెంటు జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గూడూరు మున్సిపల్ పరిధిలోని చెన్నూరు లో రెవిన్యూ సదస్సులు నిర్వహించారు.ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి,టిడిపి నాయకులు కరుణాకర్ రెడ్డి,హేమంత్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రావణి రెడ్డి మాట్లాడుతో దీర్ఘకాలంగా నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా నే ఈ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు.ప్రజల వద్దకు అధికారులు వెళ్లి సమస్యల తక్షణ పరిష్కారానికి ఈ సదస్సులను నిర్వహిస్తున్నారని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.గత ప్రభుత్వంలో పేదల భూములను పెద్దలు అక్రమించుకున్నారని వాటిని తీసుకుని పేదలకు పంచేందుకే ఈ సదస్సులు నిర్వహిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ముప్పాళ్ల గిరి కుమార్ రెడ్డి,విఆర్వో లు,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.