మీడియా ముందు గోడువెళ్ళబోసుకున్న రైతు

ప్రభాతదర్శిని,(ఓజిలి-ప్రతినిధి): ఓజిలి మండల రెవెన్యూ అధికారులు లంచాల కోసం వేధిస్తున్నారని రైతు దయాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో తన గోడును వెళ్ళబో సుకున్నారు. తనకు ఓజిలి మండలం రుద్రాయ పాలెం గ్రామంలో ఏడు ఎకరాల పట్టా భూములు ఉన్నాయని తెలిపారు. రీ సర్వే పేరుతో 7 ఎకరాల భూమిని 30 పేర్లతో గందరగోళం చేశారని తెలిపారు. పట్టా ఒక పేరుతో తాగుబడి మరో పేరుతో తమ భూములను విడగొట్టి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రీ సర్వేలో తమ భూముల రికార్డులు గోల్మాల్ అయిన విషయం గురించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన నేటికీ గోల్మాల్ అయిన రికార్డులను సరి చేయలేదని వాపోయారు. ఈ విషయమై పలుమార్లు తాసిల్దార్ విఆర్ఓ ఆర్ ఐ, సర్వేయర్ తదితరులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని తెలిపారు. తమకు వివిధ మండలాలలో భూములు ఉన్నాయని ఎక్కడలేని విధంగా డబ్బుతో ముడి పెడుతున్నారని తెలిపారు. ఓజిలి మండల రెవెన్యూ అధికారులు లంచల కోసం తమను వేధిస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఇలాంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.