ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి -ప్రతినిధి):జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా సీనియర్ జర్నలిస్ట్, శ్రీకాళహస్తి నియోజకవర్గం “ప్రభాతదర్శిని-ప్రతినిధి” చెన్నూరు వెంకటేశులును నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్చి తలపా దామోదర్ రెడ్డి తన కార్యాలయంలో ఆదివారం ఘనంగా సన్మానించ్చారు. జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా ఆయన “ప్రభాతదర్శిని” నియోజకవర్గ ప్రతినిధి చెన్నూరు వెంకటేశులు ను ఘనంగా సన్మానించ్చారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కోసం పిసిసి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిళ ఆదేశాలతో తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురువ బాబు నేతృత్వంలో తన వంతు కృషి చేస్తామన్నారు. అందులో భాగంగా నియోజక వర్గంలో మండల కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రేణిగుంట మండలం కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేశామని, త్వరలో ఏర్పేడు, శ్రీకాళహస్తిరూరల్, అర్బన్, తొట్టంబేడు మండల కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశులుకు సన్మానం
Related Posts
క్రీడలు శారీరిక మానసిక ఉల్లాసానికి అవసరం
ఇంటర్-కాలేజియేట్ టోర్నమెంట్ ముగింపులో ఎస్వీయూ వైస్ ఛాన్సలర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): క్రీడలు మానసిక ఉల్లాసానికి అవసరమని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ విజయభాస్కరరావు అన్నారు. వెంకటాచలం మండలం కాకుటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఇంటర్కాలేజియేట్ పురుషుల క్రీడల టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్లో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు…
Read moreప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యం
స్కూళ్లపై పర్యవేక్షణకు క్లస్టర్ విధానంవిద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే సమీప పాఠశాలల్లో విలీనంపాఠశాల విద్యలో మార్పు కార్యక్రమంలో కమిషనర్ : రాష్ట విద్యాశాఖ డైరెక్టర్ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): పాఠశాలలపై పర్యవేక్షణ పెంచేందుకు క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చినట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు. సోమవారం స్థానిక మహతి ఆడిటోరియంలో పాఠశాల విద్య బలోపేతం, నూతన విద్యా విధానం పై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తిరుపతి, చిత్తూరు…
Read more