ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి- ప్రతినిధి ): తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తలో స్వయంబుగా వెలసిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానము లో2025 ఫిబ్రవరి 21 వ తేది శుక్రవారం మాఘబహుళ అష్టమి నుండి 06-03-2025 గురువారం ఫాల్గుణ శుద్ధ సప్తమి వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడునని ఈ ఓ టి. బాపి రాజు తెలిపారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల రోజువారి ఉత్సవాలు వివరాలు ఇలా వున్నాయి. 2025 ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ శుక్రవారం మాఘబహుళ అష్టమినాడు శ్రీ కన్నప్ప ద్వజారోహణం, అంకురార్పణ 22వ తేది శనివారం మాఘబహుళ నవమి (దేవరాత్రి), శ్రీ స్వామివారి ద్వజారోహణము – అంబారి ఉత్సవ 23న ఆదివారం మాఘ బహుళ దశమి(భూతరాత్రి),2వ తిరునాళ్ళు – భూతశుక వాహనము, 24వ సోమవారం మాఘ బహుళ ఏకాదశి (గంధర్వ రాత్రి), 3వ తిరునాళ్ళు – రావణ బ్రహ్మ వాహనము, 25-02-2025 మంగళవారం మాఘ బహుళ ద్వాదశి (నాగరాత్రి),3వ తిరునాళ్ళు – శేషవాహనము, 26వ తేదీ బుధవారం మాఘ బహుళ త్రయోదశి-చతుర్దశి
మహాశివరాత్రి,నంది సేవ, అదే రోజురాత్రి కి లింగోద్భవము, 27 వ తేదీ గురువారము మాఘ బహుళ అమావాస్య ఉదయం, బ్రహ్మరాత్రి రథోత్సవం, రాత్రి తెప్పోత్సవం, 28వ తేదీ శుక్రవారము పాల్గుణ శుద్ధపాడ్యమి స్కంధరాత్రి,శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కల్యాణోత్సవం, మార్చి 01వ తేది శనివారము ఫాల్గుణ శుద్ధ విదియ (అనంద రాత్రి) శ్రీ సభాపతి కళ్యాణం, మార్చి 02వ తేది ఆదివారం ఫాల్గుణ శుద్ధ తదియ (ఋషి రాత్రి), కైలాసగిరి ప్రదక్షిణము, 03వ తేదీ సోమవారము ఫాల్గుణ శుద్ధ చవితి, ఉదయం తీర్థ వారి, సాయంత్రం ద్వజవరోహణము, రాత్రి దేవరాత్రి, 04వ తేది మంగళవారము ఫాల్గుణ శుద్ధ పంచమి రాత్రి పల్లకీసేవ, 05వ తేది బుధవారము ఫాల్గుణ శుద్ధ షష్టి, ఆలయము లోపల పల్లకి సేవ – ఏకాంత సేవ, 06వ తేది గురువారము ఫాల్గుణ శుద్ధ సప్తమినాడు శాంతి అభిషేకం,నిత్యోత్సవము ఆరంభము,సుప్రభాత సేవ ప్రారంభమవుతుందని ఈ ఓ తెలిపారు.