ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మలోల అన్నారు. గురువారం స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో పంచాయతీ,ఆర్ & బి, అగ్నిమాపక , రెవిన్యూ , పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వార్షిక బ్రహ్మోత్సవ ఉత్సవాలను నిర్వహించడానికి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సందర్భంగా రెవిన్యూ డివిజన్ అధికారి మాట్లాడుతూ శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల16 తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా వచ్చే భక్తులకు చలువ పందిళ్లు, త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా మజ్జిగ, ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఉత్సవాలల్లో అగ్ని ప్రమాదాలు సంభవించ కుండా ముందస్తుగా అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని పంచాయతీ అధికారులకు ఆయన సూచించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులకు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల క్యాలెండర్ ను, పాంప్లెట్లను రెవెన్యూ డివిజన్ అధికారి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో శ్రీ వేదగిరిలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి.గిరికృష్ణ, విద్యుత్ శాఖ ఎ.డి భాను నాయక్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రవీంద్ర, గ్రామీణనీటి సరఫరా శాఖ ఎ.ఇ రమణ, తదితరులు పాల్గొన్నారు.
16 నుంచి వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు…భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
Related Posts
“మానవత”చే భూరి విరాళం – ప్రత్యేక ప్రతిభావంతులకు సాయం
శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయంప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ప్రత్యేక ప్రతిభావంతులకు విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ( శైలజ)కు తిరుపతి మానవత శాఖ, రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబు చే ఒక నెలకు సరిపడే బియ్యం, పప్పు ధాన్యాలు, ముడి సరుకులను ఉచితంగా అందజేశారు. సోమవారం వికృతమాల సమీపం ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్…
Read moreలంచాల కోసం వేధిస్తున్న ‘ఓజిలి రెవెన్యూ’ అధికారులు
మీడియా ముందు గోడువెళ్ళబోసుకున్న రైతు ప్రభాతదర్శిని,(ఓజిలి-ప్రతినిధి): ఓజిలి మండల రెవెన్యూ అధికారులు లంచాల కోసం వేధిస్తున్నారని రైతు దయాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో తన గోడును వెళ్ళబో సుకున్నారు. తనకు ఓజిలి మండలం రుద్రాయ పాలెం గ్రామంలో ఏడు ఎకరాల పట్టా భూములు ఉన్నాయని తెలిపారు. రీ సర్వే పేరుతో 7 ఎకరాల భూమిని 30 పేర్లతో గందరగోళం చేశారని తెలిపారు. పట్టా ఒక…
Read more