ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం జరిన హింసను అడ్డుకోవడంలో నిఘా వ్యవస్త పూర్తిగా విఫలం అయింది అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఐఎఎస్ అధికారి విజయకుమార్ అన్నారు. సోమవారం ఆయన ఎలక్షన్ కమీషన్ సిఇవో ముఖేష్ కుమార్ మీనాను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో ఎన్నికల కమీషన్ ఎటువంటి దర్యాప్తు చేయించకుండా కేవలం ఛీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఏఎస్ ల పై చర్యలు తీసుకోవడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుంది అని ఆయన అన్నారు. చర్యలు తీసుకున్న ఐఎఎస్, ఐపిఎస్ లకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందు ఎన్నికల తరువాత హింస జరగడం చాలా సందర్బాల్లో మనం గమనిస్తూనే ఉన్నామని, అలాంటిది ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం అయ్యారని ఆయన విమర్శించారు. తమ తప్పును కప్పి పుచ్చుకోనేందుకు నలుగురు ఐఊ అధికారుల పై చర్యలు తీసుకోవడాన్ని ఆయన తప్పు బట్టారు. చర్యలు తీసుకున్న నలుగురు ఐఎఎస్ లలో ముగ్గురు బలహీన చెందిన వారే అని ఆయన గుర్తు చేశారు. విచారణ జరిపించకుండా చర్యలు తీసుకోవాడాని తమ పార్టీ సహించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తమ తప్పును సరిచేసుకొని చర్యలు తీసుకున్న అధికారులకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి ప్రాంతాల్లో జరిగే హింస గురించి మీకు ముందు అవగాహన లేదా గతంలో జరిగిన అంశాలను మీరు పరిశీలించలేదా అని ఎన్నికల కమీషన్, సిఎస్ లను విజయకుమార్ ప్రశ్నించారు. బలహీన వర్గాలను బదిలీ చేసి బలిపశువులను చెయ్యడాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, అనంతపురం,పల్నాడు, తిరుపతి జిల్లాల కలెక్టర్లను మార్చితే…ఆనలుగురు కలెక్టర్లల్లో ముగ్గరు బలహీన వర్గాలకు చెందిన వారే అని తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్ గా శివశంకర్ ను తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాబోవు రోజుల్లో కూడా బిసి ఎస్సీ ఎస్టీ వర్గాల లకు ఎటువంటి ఆపద వచ్చినా, వారి హక్కులకు భంగం కలిగినా తమ పార్టీ, తాను ముందు ఉండి పోరాడుతామని విజయ్ కుమార్ తెలిపారు.