ప్రభాతదర్శిని, (నాయుడుపేట ప్రతినిధి): స్థానిక ఎమ్మెల్యే హత్య రాజకీయాలు చేసిన దౌర్భాగ్యుడని మాజీ ఎమ్మెల్సీ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణరెడ్డి ధ్వజమెత్తారు. నాయుడుపేట లో శుక్రవారం జరిగిన సీనియర్ రాజకీయవేత్త కనుమూరు గోపాల్ రెడ్డి, ఆయన అనుచరులు కాటూరి ఫణీందర్ రెడ్డి, ఎద్దల శేఖర్ రెడ్డి, కోవూరు వెంక రెడ్డి లు టిడిపిలో చేరిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓజిలిలో ఇప్పటికే ఎమ్మెల్యే హత్య రాజకీయాలు కు ఇద్దరు బలయ్యారని ఆరోపించారు. మానమాల గ్రామంలో సీనియర్ రాజకీయవేత్త ఉచ్చూరు వెంకటసుబ్బారెడ్డి ని ఎన్ డి సి డైరెక్టర్ పదవి నుండి తొలగించడంతో ఆ అవమానం భరించలేక మనోవేదనతో మంతన పట్టి మృతి చెందాడని అన్నారు. సుబ్బారెడ్డి మృతి ముమ్మాటికి స్థానిక ఎమ్మెల్యే చేసిన హత్య రాజకీయమని అన్నారు. స్థానిక ఎన్నికలలో కోరుకొండ గ్రామానికి చెందిన ముమ్మారెడ్డి ఇందిరమ్మకు ఎంపీపీ పదవిని ఇస్తామని చెప్పి, అందుకు అవసరమైన ధనాన్ని ఖర్చు చేయించి మోసం చేశారని ఆయన అన్నారు. ఇందిరమ్మ తనయుడు అకాల మృతితో పుట్టిడు శోకంలో ఉన్న వారిని ఆదరించిన ఓదార్పు ఇవ్వాల్సిన ఎమ్మెల్యే వారిని మరింత మానసిక క్షోభకు గురిచేసి వారి కుటుంబంలో ఎంపీపీ పదవి ఇచ్చి చిచ్చు పెట్టారని విమర్శించారు. ఇందిరమ్మ తనయుడు మృతి చెందితే ఆమె ఎంపీపీ పదవికి అర్హురాలు కాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఒకవైపు కుమారుని పోగొట్టుకొని మరోవైపు రాజకీయ అవమానాన్ని భరించలేక సౌమ్యుడు అయిన ఇందిరమ్మ భు ముమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి అదే వేదనతో మృతి చెందాడని తెలిపారు. ఇది కూడా స్థానిక ఎమ్మెల్యే ఆయన ఆరోపించారు. తన అవసరం కోసం ఉపయోగించుకొని నమ్మకంగా తడి గుడ్డతో గొంతు కోసే ఎమ్మెల్యేని తాను ఎక్కడ చూడలేదని అన్నారు. ఓజిలి మండలంలో గతంలో టిడిపిలో ఉన్న కొందరు నాయకులు పరిస్థితుల ప్రభావంతో వైసీపీలోకి వెళ్ళిన కనుమూరు గోపాల్ రెడ్డి ని చులకన చేసి, అవమానపరిచి, అవహేళన చేశారని ఆయన ఆరోపించారు. ఇలాంటి వారికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతామని, గోపాల్ రెడ్డికి ఎల్లవేళలా తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆ పార్టీలోనే వ్యక్తులకు మట్టి గ్రావెల్, క్వారీ సహజ సంపదలను దోచి పెట్టారని విమర్శించారు. సూళ్లూరుపేట టిడిపి ఇన్చార్జి నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులను కొంటామని డబ్బులు ఎత్తుకొని తిరుగుతున్నారని, టిడిపి నాయకులు కార్యకర్తలు అమ్ముడుపోయే రకం కాదని ఆయన అన్నారు. 2019లో టిడిపి అభ్యర్థి గెలుపు కోసం కృషిచేసి కొన్ని అన్నివార్య పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ లకు వెళ్లిన నాయకులు టిడిపిలో పుట్టి రాజకీయంగా ఎదిగిన వారిని అన్నారు. వైసిపి కి వెళ్లి నాయకులు తిరిగి టిడిపికి రావడం సంతోషమని అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గున్నం రెడ్డి సేవా సంస్థ అధినేత గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి వంటి సేవ దృక్పథం కలిగిన వారు టిడిపిలోకి రావడం తమ కుమార్తె చేసుకున్న అదృష్టం అనే కొనియాడారు. మధుసూదన్ రెడ్డి పేద విద్యార్థుల విద్య అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరు సమన్వయంతో వ్యవహరించి టిడిపి అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ, బిజెపి ఎంపీ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గానికి ఈశాన్యం మూలైన ఓజిలి మండలం నుండి వైసీపీ అవినీతి అరాచక దౌర్జన్యాలపై టిడిపి నాయకుల చేరికతో దండయాత్ర మొదలైందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పరసా వెంకట రత్నయ్య, తిరుపతి జిల్లా కార్యదర్శి వేనాటి సతీష్, శిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి, ఎన్నికల పరిశీలకులు కొండలరావు, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, ఓజిలి మండల అధ్యక్షులు గుజ్జులపూడి విజయ్ కుమార్ నాయుడు, ఎద్దల ధనంజయ రెడ్డి, కనుమూరు గోపాల్ రెడ్డి, దాసరి నిరంజన్, అలిమిలి మల్లికార్జునరెడ్డి, మంగళపూరి ఫ్రాంక్లిన్, నన్నూరు శ్రీనివాసరావు, మైనార్టీ నాయకులు ఖలీల్, వల్లూరు మురళీధరరావు, టిడిపి మాజీ ప్రధాన కార్యదర్శి ఎన్. కమలాకర్ బాబు, మన్మధరావు, తదితరులు పాల్గొన్నారు.
హత్యరాజకీయాలతో ఇద్దర్ని పొట్టను పెట్టుకున్న దౌర్భాగ్యపు ఎంఎల్ఏ : మాజీ ఎంఎల్ సి వాకాటి నారాయణ రెడ్డి
Related Posts
ఏసీబీకి చిక్కిన డిప్యుటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి
ప్రభాతదర్శిని,(జగిత్యాల జిల్లా ప్రతినిధి):జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డిప్యుటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆఫిసోద్దీన్ 4,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పల్లెపునరేష్ అనే వ్యక్తి కథలాపూర్ మండలం ఇప్పపల్లి వద్ద మామిడి తోటలో చెట్లు కోస్తుండడంతో పర్మిషన్ నిమిత్తం అధికారులను సంప్రదించగా పదివేలు డిమాండ్ చేయడంతో…
Read more“మానవత”చే భూరి విరాళం – ప్రత్యేక ప్రతిభావంతులకు సాయం
శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయంప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ప్రత్యేక ప్రతిభావంతులకు విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ( శైలజ)కు తిరుపతి మానవత శాఖ, రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబు చే ఒక నెలకు సరిపడే బియ్యం, పప్పు ధాన్యాలు, ముడి సరుకులను ఉచితంగా అందజేశారు. సోమవారం వికృతమాల సమీపం ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్…
Read more