కాకమ్మ కథలు చెబుతున్న ఓజిలి ఎస్సై ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): సోషల్ మీడియా వేదికగా ఆసభ్యకరమైన మెసేజ్లు పెట్టి అవమానపరిచిన సంఘటనపై ఓజిలి మండలం పోలీసులు కేసు నమోదు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫిబ్రవరి నెల 7వ తేదీన పాత కక్ష్యలను దృష్టిలో పెట్టుకొని ఓ రాజకీయ పార్టీ కి చెందిన ఒక వాట్సాప్ గ్రూప్ లో అసభ్యకరమైన నిరాధారణమైన, పోస్టులను ఓ ప్రబుద్ధుడు పోస్ట్ చేశాడు. ఈ విషయమై మనోభావాలు దెబ్బతిన వ్యక్తి ఓజిలి పోలీసులకు, సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు పై చర్యలు తీసుకునేందుకు ఓజిలి మండలం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేసు నమోదు చేసే విషయమై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఓజిలి ఎస్సై కె.స్వప్నను అడిగితే అసభ్యకరమైన నిరాధారణమైన మనోభావాలు దెబ్బతీసే మేసేజ్ లు పై కేసు నమోదు చేసేందుకు వీలులేదని చెప్పుకొచ్చారు. కేసు ఎందుకు నమోదు చేయకూడదో, అందుకు కారణాలు తెలియజేస్తూ ఎండార్స్ మెంట్ ఇవ్వాలని, కోర్టులో తేల్చుకుంటానని, కోరితే, రేపు ఇస్తాను…రెండు రోజులలో ఇస్తాను‌..అంటూ ఎండార్స్ మెంట్ కనిపించడం లేదని, నెల రోజుల నుండి ఇవ్వకుండా పొంతనలేని, కథలు చెబుతుండడం విశేషం. కేసు నమోదు చేయకుండా, ఎండార్స్ మెంట్ ఇవ్వకుండా, ఎస్ ఐ ఇలా కేసును నీరుగార్చేందుకు వ్యవహరించేందు క్యాష్ కారణమో? క్యాస్ట్ కారణమో? ఆ లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక.