ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):సీతారామపురంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించి ప్రజల దాహార్తిని తీరుస్తామని నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సీతారామపురంలో ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వేమిరెడ్డికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మండల వ్యాప్తంగా వచ్చిన నాయకులు, కార్యకర్తలతో ప్రచారం ఆద్యంతం ఉర్రూతలూగించిది. ఈ సందర్భంగా ప్రచారరథంపై నుంచి ప్రజలను ఉద్దేశించి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సీతారామపురం ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ అవస్థలను పరిష్కరించి నీటి వసతి కల్పించేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రజల ఆదరణ చూస్తుంటే తప్పకుండా వచ్చేది మన ప్రభుత్వమేనని స్పష్టమైందన్నారు. చంద్రబాబు సీఎం అయితే తప్పకుండా యువతకు ఉద్యోగాలు వచ్చి జీవితాలు బాగు పడతాయని అన్నారు. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడేలా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఉదయగిరి ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్‌ని, ఎంపీగా తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మేకపాటి శాంతకుమారి, నియోజకవర్గ పరిశీలకులు వేనాటి సతీష్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి, తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
సీతారామపురం ప్రజల దాహార్తి తీరుస్తాం – ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి
Related Posts
“మానవత”చే భూరి విరాళం – ప్రత్యేక ప్రతిభావంతులకు సాయం
శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయంప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ప్రత్యేక ప్రతిభావంతులకు విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ( శైలజ)కు తిరుపతి మానవత శాఖ, రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబు చే ఒక నెలకు సరిపడే బియ్యం, పప్పు ధాన్యాలు, ముడి సరుకులను ఉచితంగా అందజేశారు. సోమవారం వికృతమాల సమీపం ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్…
Read moreలంచాల కోసం వేధిస్తున్న ‘ఓజిలి రెవెన్యూ’ అధికారులు
మీడియా ముందు గోడువెళ్ళబోసుకున్న రైతు ప్రభాతదర్శిని,(ఓజిలి-ప్రతినిధి): ఓజిలి మండల రెవెన్యూ అధికారులు లంచాల కోసం వేధిస్తున్నారని రైతు దయాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో తన గోడును వెళ్ళబో సుకున్నారు. తనకు ఓజిలి మండలం రుద్రాయ పాలెం గ్రామంలో ఏడు ఎకరాల పట్టా భూములు ఉన్నాయని తెలిపారు. రీ సర్వే పేరుతో 7 ఎకరాల భూమిని 30 పేర్లతో గందరగోళం చేశారని తెలిపారు. పట్టా ఒక…
Read more