టిటిడి బోర్డు మెంబర్ గా అవకాశంపై ధన్యవాదాలు
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సోమవారం అమరావతిలోని సీఎం నివాసానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు సీఎంని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. టిటిడి బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించడంపై సీఎంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దేవదేవుడి సేవకు అవకాశం రావడం సంతోషంగా ఉందని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా శ్రీవారి భక్తులకు సేవ చేస్తామని వారు స్పష్టం చేశారు.
సీఎం నారా చంద్రబాబు ని కలిసిన వేమిరెడ్డి దంపతులు
Related Posts
అట్టహాసంగా ప్రారంభమై… అంగరంగ వైభవంగా… ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు
ముగింపు కార్యక్రమ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, మంత్రి అనగాని సత్యప్రసాద్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమాలు జిల్లాలో అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, పర్యాటక రంగ అభివృద్ధికి, సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇది మంచి ప్రభుత్వం అని మూడవ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమ ముగింపు వేడుకలకు రాష్ట్ర…
Read moreఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కి తరలి వస్తున్న ప్రజలు పర్యాటక ప్రేమికులు
ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ప్రజల్ని పర్యాటకులను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలుఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వస్తున్న విద్యార్థులు, ప్రజలు, పర్యాటకులుజన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణంవివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత ప్రభాతదర్శిని ( సూళ్లూరుపేట-ప్రతినిధి ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 రెండవ రోజు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులలో కిక్కిరిసిన జనం కేరింతలతో ఉత్సాహంగా…
Read more