లైవ్‌లో యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్, ఎండీ ప్రదీప్ గుప్తా కంటతడి
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అంచనాలు తప్పడంతో యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్, ఎండీ ప్రదీప్ గుప్తా లైవ్‌లో కంటతడి పెట్టుకున్నారు. ఇండియా టుడే ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజీలో పాల్గొన్న ప్రదీప్ గుప్తా .. ప్యానెల్ చర్చ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ అంశం గరించి ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అంచనాలు తారుమారవడంతో భావోద్వేగానికి గురైన ఆయన లైవ్‌లోనే కంటతడి పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అనేక సర్వేలు భాజపా భారీ మెజార్టీతో గెలుస్తుందని ప్రకటించారు. ఇక యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 361-401 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇండియా కూటమి 131-166 సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది. అయితే ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం చూస్తే భాజపా మెజారిటీ మార్క్‌ను దాటినా సర్వేలో అంచనా వేసిన సీట్లను మాత్రం గెలుచుకోలేకపోయింది. ”యాక్సిస్ మై ఇండియా గత 10 ఏళ్లుగా ఎగ్జిట్ పోల్స్‌ను నిర్వహిస్తోంది. రెండు లోక్‌సభ ఎన్నికలతో సహా మొత్తం 69 ఎన్నికలకు సర్వేలు చేశాం. మా అంచనాలు 65 సార్లు కరెక్ట్‌గా ఉన్నాయి’’ అని నిన్న ఓ వార్తా సంస్థతో ప్రదీప్ గుప్తా అన్నారు. కానీ.. ఈసారి సర్వేల అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఒక్కోసారి ఇలాంటి సర్వేల ఫలితాలు తారుమారవుతుంటాయి.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.