ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట ఎంఎల్ఏ, ఎంపీ అభ్యర్థులు, కిలివేటి సంజీవయ్య, డాక్టర్ మద్దిల గురుమూర్తిలను గెలిపించాలని నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒట్టూరు కిషోర్ యాదవ్ అన్నారు. మంగళవారం నాయుడుపేట మండలంలోని పూడేరు పంచాయతీలో ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రతిగడపకు వెళ్లి ఐదేళ్ల వైసిపి పాలనలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పూడేరు పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ సంజీవయ్యకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని గుర్తు చేశారు.జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి పథకాల అమలతో పాటు, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. మే నెల 13వ తేదీ జరిగిన ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటేసి సూళ్లూరుపేట నియోజకవర్గం అభ్యర్థి కెలివేటి సంజీవయ్య, అభ్యర్థి మద్దెల గురుమూర్తి లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు తీసుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రతిపక్షాల ప్రలోభాలకు గురికాకుండా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూడేరు సర్పంచ్ శాంతమ్మ, మాజీ సర్పంచ్ భూపయ్య, సచివాలయ కన్వీనర్ బాలసుబ్రమణ్యం, వైసిపి నాయకులు దొరస్వామి, రాజా ఆదిశేషు, చంద్రబాబు, సుబ్రహ్మణ్యం, నాయకులు పాల్గొన్నారు.
సంక్షేమ పాలన కొనసాగించేందుకు వైసిపి అభ్యర్థులను గెలిపించండి..నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి
Related Posts
“మానవత”చే భూరి విరాళం – ప్రత్యేక ప్రతిభావంతులకు సాయం
శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయంప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ప్రత్యేక ప్రతిభావంతులకు విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ( శైలజ)కు తిరుపతి మానవత శాఖ, రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబు చే ఒక నెలకు సరిపడే బియ్యం, పప్పు ధాన్యాలు, ముడి సరుకులను ఉచితంగా అందజేశారు. సోమవారం వికృతమాల సమీపం ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్…
Read moreలంచాల కోసం వేధిస్తున్న ‘ఓజిలి రెవెన్యూ’ అధికారులు
మీడియా ముందు గోడువెళ్ళబోసుకున్న రైతు ప్రభాతదర్శిని,(ఓజిలి-ప్రతినిధి): ఓజిలి మండల రెవెన్యూ అధికారులు లంచాల కోసం వేధిస్తున్నారని రైతు దయాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో తన గోడును వెళ్ళబో సుకున్నారు. తనకు ఓజిలి మండలం రుద్రాయ పాలెం గ్రామంలో ఏడు ఎకరాల పట్టా భూములు ఉన్నాయని తెలిపారు. రీ సర్వే పేరుతో 7 ఎకరాల భూమిని 30 పేర్లతో గందరగోళం చేశారని తెలిపారు. పట్టా ఒక…
Read more