మంత్రి నారాయణ సతీమణి కి ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు
ప్రభాతదర్శిని,( నెల్లూరు – ప్రతినిధి): నెల్లూరులో భక్తుల కొంగుబంగారమై విరాజుల్లుతున్న శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని రాష్ట్ర మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ఆకాంక్షించారు. గురువారం నెల్లూరు రూరల్ లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పొంగూరు రమాదేవి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రమాదేవికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వరీ దేవికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం పొంగూరు రమాదేవికి వేద పండితులు ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నెల్లూరు అభివృద్ధి ప్రదాత డాక్టర్ పొంగూరు నారాయణ గార్లతోపాటు ప్రజలందరికీ అమ్మ ఆశీస్సులు మెండుగా ఉండి రాష్ట్రం అభివృద్ధి దిశగా ప్రయాణించాలంటూ ఆకాంక్షించారు. అనంతరం నగరంలోని పలు అమ్మవారి ఆలయాలను పొంగూరు రమాదేవి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా ఆలయాల వద్ద రమాదేవికి ఘన స్వాగతం లభించింది. పదవ డివిజన్ బాబు గిరిజన కాలనీలో మహాలక్ష్మి అమ్మవారు, కోదండ రామపురంలోని మహాలక్ష్మి అమ్మవారు, సిఆర్పి డొంకలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలలో సందర్శించి పూజలు నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా పలు ఆలయాల్లో రమాదేవి చేతుల మీదుగా భక్తులకు అన్నదానం చేశారు. దసరా పండుగను పురస్కరించుకొని ఆలయాల వద్ద చక్కగా భక్తిపారవస్యం ఉట్టిపడేలా ఏర్పాట్లను చేపట్టిన ఆయా ఆలయ నిర్వాహకులను మంత్రి నారాయణ సతీమణి రమాదేవి అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల నాయుడు టిడిపి ముఖ్య నేతలు నాయకులు,తదితరులు పాల్గొన్నారు.