ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి, బుచ్చినాయుడు కండ్రిగ-ప్రతినిధి): విజయదశమి సందర్బంగా పల్లమాలలో వెలసివున్న శ్రీ శ్రీ శ్రీ పచ్చాలమ్మ అమ్మవారిని శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు యస్. సి. వి నాయుడు శనివారం దర్శించుకున్నారు.ఈ సందర్బంగా శ్రీ శ్రీ శ్రీ పచ్చాలమ్మ అమ్మవారి నూతన కల్యాణ మండపం నిర్మాణం చేపడుతున్నట్లు యస్. సి. వి నాయుడుకి ఆలయ నిర్వాహకులు తెలియజేయగా, తన వంతు సహాయంగాపది లక్షలు రూపాయలు విరాళా న్ని శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు యస్. సి. వి నాయుడు ప్రకటించారు. అంతేకాకుండా కల్యాణ మండప నిర్మాణం పూర్తి అయ్యేవరకు సహాయ, సహకారాలు అందిస్థానని తెలియజేసారు.అనంతరం యువతకు భక్తి మార్గం గురించి యస్. సి. వి నాయుడు మార్గదర్శనం చేసారు.ఈ సందర్బంగా యస్. సి. వి నాయుడుతో సెల్ఫీల కోసం యువతపోటీ పడి తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుదర్శన్ నాయుడు, హరిబాబు నాయుడు, కన్నయ్య నాయుడు, ఎక్స్ యం. పి.టి. సి. వీర రాఘవులు, యూనిట్ ఇంచార్జ్ సురేష్, జి. మునస్వామి ఆచారి, వెంకటకృష్ణ, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.
శ్రీ పచ్చాలమ్మ కళ్యాణ మండపం నిర్మాణానికి యస్. సి. వి నాయుడు రూ. పది లక్షలు విరాళం
Related Posts
అట్టహాసంగా ప్రారంభమై… అంగరంగ వైభవంగా… ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు
ముగింపు కార్యక్రమ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, మంత్రి అనగాని సత్యప్రసాద్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమాలు జిల్లాలో అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, పర్యాటక రంగ అభివృద్ధికి, సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇది మంచి ప్రభుత్వం అని మూడవ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమ ముగింపు వేడుకలకు రాష్ట్ర…
Read moreఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కి తరలి వస్తున్న ప్రజలు పర్యాటక ప్రేమికులు
ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ప్రజల్ని పర్యాటకులను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలుఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వస్తున్న విద్యార్థులు, ప్రజలు, పర్యాటకులుజన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణంవివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత ప్రభాతదర్శిని ( సూళ్లూరుపేట-ప్రతినిధి ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 రెండవ రోజు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులలో కిక్కిరిసిన జనం కేరింతలతో ఉత్సాహంగా…
Read more