ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):నర్సాపురం శ్రీ వై. యన్. కళాశాల లోని శ్రీ జి.వి.ఆర్. ఇన్స్టిట్యూట్ అఫ్ ఎడ్యుకేషన్ (బి.ఇడి కళాశాల) ప్రిన్సిపాల్ డాక్టర్ పిట్టా శాంతి కి జాతీయ ప్రతిభా పురస్కారమును గుంటూరు కు చెందిన సదరన్ ప్రైవేటు లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ ప్రదానంచేసింది. గుంటూరు లోని ఆంధ్ర క్రైస్తవ కళాశాల అసెంబ్లీ హాల్ లో ఆంధ్రప్రదేశ్ కృష్ణ- గుంటూరు జిల్లాల లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబెర్ శ్రీ కె.ఎస్.లక్ష్మణ రావు ,గుంటూరు తూర్పు శాసనసభ్యులు శ్రీ నసీర్ మహామ్మద్ ,గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు శ్రీ మతిగల్లా మాధవి,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ రెక్టార్ ఆచార్య రత్నషీలామణి,ఏసి కళాశాల ప్రిన్సిపాల్ డా కె మోజేష్ ,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఈ సి మెంబర్ & కన్నా విద్యాసంస్ధల ఛైర్మన్ కన్నా మాష్టారు చేతుల మీదుగా ప్రిన్సిపాల్ డాక్టర్ పిట్టా శాంతి కి ఈ పురస్కారమును అందచేసారు. ఈ సందర్భంగా నర్సాపూర్ శ్రీ వై. యన్. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండంట్ డా. చినమిల్లి సత్యనారాయణ రావు, బి.ఇడి. కళాశాల కరెస్పాండంట్ శ్రీ కానూరి స్వామి నాయుడు గారు, శ్రీ వై. యన్. కళాశాల పాలకవర్గం సభ్యులు, ప్రిన్సిపాల్ డా. సిహెచ్. కనకారావు, కళాశాల డీన్ డా. గంధం శ్రీ రామ కృష్ణ, బి.ఇడి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ ముత్యాల కళ్యాణ రామ కృష్ణ రావు,పి జి కళాశాల డైరెక్టర్ డా చింతారావు మరియు అధ్యాపక, అధ్యాపకేతర బృందం అవార్డు గ్రహీతను అభినందించారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.