ప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి-ప్రతినిధి):శ్రీకాళహస్తి దేవస్థానం నూతన కార్యనిర్వాహణాధికారిగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బికే వెంకటేశులు గురువారం బాధ్యతలు తీసుకున్నారు.అంతకు ముందుకు ఈఓ వెంకటేశులు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనము, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు.అనంతరం శ్రీ గురు దక్షిణామూర్తి సన్నిధానంలో శ్రీకాళహస్తి ఆలయ కార్యనిర్వాహణాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈఓలుగా పని చేసిన అధికారులు వారి ఛాంబర్ లో బాధ్యతలు తీసుకుంటే కొత్త ఈఓ వెంకటేశులు శ్రీ గురు దక్షిణామూర్తి విగ్రహం ఎదుట బాధ్యతలు స్వీకరించడం విశేషం. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు నాగరాజు, రాఘవయ్య, డిఈఓ కృష్ణారెడ్డి, ప్రోటోకాల్ ఏఈవో మోహన్, ఏఈవో హేమామాలిని, ఏఈవో లోకేష్ బాబు, పర్యవేక్షకులు నాగభూషణం, రవి, ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్, పురోహితులు అర్ధగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.