ప్రభాతదర్శిని, (ఓజిలి-ప్రతినిధి): సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నాయుడు డిఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన ఓజిలి పోలీస్టషన్ లో ఎస్ ఐ రవిబాబు ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల విషయంపై నాయకులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రజలు సహకరించారని, అదేవిధంగా ఎన్నికల ఫలితాలు వెలువడే సందర్భంలో కూడా ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారని వాటి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి, సోదర భావంతో కలిసిమెలిసి జీవించేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కవింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూన్ 4 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రతి ఒక్కరు 144 సెక్షన్ అనుసరించి నడుచుకోవాలని సూచించారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఎవరు కూడా ఏ ఒక్కరిని లక్ష్యంగా చేసుకొని రెచ్చ కొట్టే ప్రయత్నాలు చేయరాదన్నారు. అలాగే కక్షలు కార్పణాలు పెంచే విధంగా సామాజిక మధ్యమాలలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్ర పర్యవేక్షణను ప్రతినిత్యం కాపాడుకునేందుకు తమ సిబ్బంది చిత్తశుద్ధితో 24 గంటలు పాటు పహారకాస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శాంతిభద్రతలు తలెత్తితే చోటుచేసుకునే పరిణామాలు, పరిస్థితులు ఇబ్బందులు పై అవగాహన కల్పించారు.