ప్రభాతదర్శిని, (పొలిటికల్-బ్యూరో): ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన ఎన్నికలు వైసీపీ కొంప ముంచాయి. జగన్ మ్యానియా పని చేస్తుందని, సంక్షేమపథకాలుగట్టెక్కిస్తాయని.. సామాజిక న్యాయం తమకు న్యాయం చేస్తుందని భావించిన వైసీపీ చివరికి చతికిల పడింది. 2019లో 15 సీట్లు ఇచ్చిన ప్రజలు 2024 ఎన్నికల్లో11సీట్లకు పరిమితం చేసి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే తీర్పునిచ్చారు. ఈ తరుణంలోనే ఓటమికిగల కారణాలను ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఆలోచిస్తున్నారు. కానీఅన్నంటికంటే అసలు కారణం జగన్ చుట్టు వుండే కోటరీ అనేది జగమెరిగిన సత్యం. జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి నిన్నటి వరకుచేసిన ప్రతి పనిలో జగన్కి 10శాతం ప్రమేయంఉంటే చుట్టూ ఉండే కోటరీది 90 శాతం పాత్ర ఉంటుంది. అటు ప్రజలతోపాటు ఇటు పార్టీ నేతల్లో కూడా జగన్ పై వ్యతిరేకత రావడానికిప్రధానకారణం కోటరీలో ఉండే ఆ ఇద్దరే అని నేతలంతా గళం విప్పుతున్నారు. వారివల్లే ఈస్థాయిలో పార్టీ దెబ్బతిందని వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.కనిపించే సీఎం జగన్ ఒకరైతే.. కనపడని షాడో సీఎం మరొకరు ఉన్నారు. సీఎం తర్వాత తానే సీఎం అనేంత రేంజిలో బిజీబిజీగా గడుపుతూ.. ప్రతి ప్రభుత్వం మీటింగ్లోనూ.. ప్రైవేట్ మీటింగ్లోనూ తానే కనపడేవారు. ఈ తరహా వైఖరిపై విమర్శలు వస్తున్నప్పటికీ.. మళ్లీ అదే రిపీట్ చేస్తూ.. చివరికిపార్టీ పతనానికి కూడా ఒకకారణం అయ్యారు. అతనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరికిమంత్రి పదవులు రావాలన్నా.. ఎవరికైనా పోస్ట్ కేటాయించాలన్నారు.. చిన్నస్థాయి నుంచి పెద్దస్థాయి అధికారుల వరకు.. బదిలీ చేయాలన్నా సజ్జల అనుమతి లేనిదే.. సీఎం జగన్ చేయడమే టాక్పెద్ద ఎత్తున నడిచింది.2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి నిన్నా మొన్నటి వరకు కూడా ఇదే నడిచిందని భాహాటంగానే సొంతనేతలు సైతం విమర్శ లు గుప్పించారు. సజ్జలరామకృష్ణారెడ్డి వల్లే పార్టీ ఇంతలా దిగజారి పోయిందని.. 11సీట్లకే పరిమితం అయ్యిందని ఫైర్ అవుతున్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశవర్కర్స్ఇలా ఎవరితోచర్చలు జరిగిన.. ప్రతి సందర్భంలోనూ సజ్జల వీరు ఎవరు తమ ఓటు బ్యాంకు కాదని కించపరిచే విధంగా మాట్లాడేవారు. ఈమాటలే ఎన్నికల్లో రిఫ్లెక్ట్అయ్యాయని చాలా మంది భావిస్తున్నారు. ఆయన మాట్లాడిన తీరువల్లే వారి ఓటుబ్యాంక్ అంతా చేజారిందని వాపోతున్నారు. పార్టీ ఓటమికి పూర్తిబాధ్యత అంతాసజ్జల పైనే ఉంటుందని సొంత నేతలే నిప్పులు చెరుగుతున్నారు. సజ్జల తర్వాత ఆస్థాయిలో పార్టీ ఓటమికి కారణమైన వ్యక్తి ఎవరా అంటే.. సీఎంఓలో ఉండే ధనుంజయ రెడ్డి వైపే అందరి వేళ్లు చూపిస్తున్నా యి. ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తూ అన్ని నిర్ణయాలు తానే తీసుకుంటూ.. అరాచకాలు చేసుకుంటూ ముందుకు వెళుతుంటే దానికి ధ్రువీకరణ పత్రం ఇచ్చింది ధనుజయ రెడ్డి అని చెబుతున్నారు. నిర్ణయాలు సజ్జలు తీసుకుంటే ఆర్డర్లు ధనుంజయ రెడ్డి ఇచ్చేవారని? అధికారులు మొత్తాన్నితన గుప్పెట్లో పెట్టుకున్నారని మండిపడు తున్నారు. జగన్ ఓటమికి కారణమైన ప్రతి తప్పులో ధనుంజయ రెడ్డి హస్తం కూడా ఉందని బహిరంగంగానే ఆరోపణలువినిపిస్తు న్నాయి. ఈ వ్యవహారంపైనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే మీడియా సాక్షిగా కుండబడ్డలు కొట్టేలా మాట్లాడడం ఈ ఆరోపణలను నిజం చేస్తున్నాయి. వైసీపీ ఓటమి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన రాజా నగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధనుంజయ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. సీఎం జగన్ ని కలిసేఅవకాశం కూడా తమకి ఇవ్వలేదని.. తానే సీఎం లాగా బిహేవ్ చేసే వారని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ్ రెడ్డి కలిసి పార్టీనాశనానికి కృషి చేశారే తప్ప.. ఎదుగుదలకు ఎక్కడ ఉపయోగపడలేదని తీవ్ర ఆరోపణలైతే వినపడుతున్నాయి.