
-అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులకు శంకరగిరి మాన్యాలు
-పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉంటాం:-ఉమ్మడి నెల్లూరు జిల్లా జిల్లా వైకాపా అధ్య క్షులు గోవర్థన్ రెడ్డి
ప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి):రాష్ట్రంలో ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసిపి సానుభూతిపరులపై అక్రమంగా కేసులు పెట్టించి వారిపై దాడులు చేయిస్తున్నారని అక్రమంగా వైసిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా ఏ అధికారులను వదిలిపెట్టమని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం గూడూరు మండలం మంగళ పూరు గ్రామంలో వైసిపి సానుభూతిపరుడు సతీష్ యాదవ్ ను మాజీ మంత్రి ఆదివారం పరామర్శించారు. గూడూరు మండలం మంగళ పూరు గ్రామానికి చెందిన వైసీపీ సానుభూతిపరుడు సతీష్ యాదవ్ ను పోలీసులు ఎలాంటి కారణం లేకుండా కేసు ఉందని స్టేషన్ కు తీసుకువెళ్లి కొట్టి గాయపరిచారు. జరిగిన విషయాన్ని గూడూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు, గ్రామానికి చెందిన ఎద్దల నరేంద్ర రెడ్డి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి తెలియజేయడంతో ఆదివారం మాజీ మంత్రి కాకాణి ,ఎమ్మెల్సీ మేరీగ మురళి ధర్ లు మంగళపూరు గ్రామానికి విచ్చేశారు. స్థానిక నాయకులు ఎద్దల నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొండూరు సునీల్ రెడ్డి, ఎంపీపీ గురవయ్యలు పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తదుపరి సతీష్ యాదవ్ నివాసానికి వెళ్లి యువకుడిని పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి కాకాణి ఈ సందర్బంగా మాట్లాడుతూ మంగళ పూరు గ్రామానికి చెందిన సతీష్ యాదవ్ ను ఫ్లెక్స్ చించి వేశాడని అనుమానంతో పోలీసులు తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టి ఎటువంటి కేసు నమోదు చేయకుండా గాయపరిచారని, ఇది అమానుషం అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసిపి కార్యకర్తలు సానుభూతిపరులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అయితే వాటికి భయపడేది లేదని తెలిపారు. వైసిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులను తప్పక గుర్తుంచుకుంటామని అధికారం ఎవరికి శాశ్వతం కాదని ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి కి ధైర్యం ఉంటే ఇప్పుడు ఎన్నికలు జరిపించాలని ప్రజల తీర్పు ఎలా ఉంటుందో తెలుస్తుందని సవాల్ విసిరారు.కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ మేరీగ మురళి మాట్లాడుతూ రాజకీయాలు హుందాతనంగా చేయాలని కక్షపూరితంగా కేసులు పెట్టి గాయపరచడం మంచి పద్ధతి కాదని అన్నారు వైసీపీ క్యాడర్ ఎక్కడా చెక్కుచెదరలేదని ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంపీపీ బూదూరు గురవయ్య, కొండూరు సునీల్ కుమార్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వసంత్ కుమార్ రెడ్డి,నాయకులు వాయిగండ్ల నాగరాజు,అట్ల శ్రీనివాసులురెడ్డి, ఈదగాలి వసంత్ రెడ్డి, మెట్ట రాధారెడ్డి, డేగపూడి కృష్ణారెడ్డి, ప్రభాకర్ రాజు,వాకాటి మస్తాన్ రెడ్డి, ఇందుకూరు జనార్దన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సంపత్ రెడ్డి, ఎస్కే సుభాన్, కొట్టు గోవర్ధన్, అల్లం వెంకట రమణయ్య,ఈదూరు ప్రసాద్, కొట్టు అశోక్, రవి,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.