ప్రభాతదర్శిని,(ప్రత్యేక-ప్రతినిధి): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందిందని ఆ పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి ఓట్టూరు కిషోర్ కుమార్ యాదవ్ అన్నారు.బుధవారం ఆయన నాయుడుపేట మండలం పండ్లూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసిన ఘనత జగన్ కు దక్కిందని ఆయన అన్నారు. తాము ఎన్నికల ప్రచారం కోసం ఇంటింటికి వెళుతుంటే ఓటర్లు తాము జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తామని, సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి సంజీవయ్య ను ముచ్చట గా మూడో సారి గెలిపిస్తామని చెప్పడం ఆనందం గా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉన్నారని, పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దక్కిందని అన్నారు. నాయుడుపేట ఎంపిపి కురుగొండ ధనలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో మహిళలకు రాజకీయక నామినేటెడ్ పదవుల ఇచ్చి వారి ఎదుగుదల కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ ఒట్టూరు రాధా కిషోర్ యాదవ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మహిళ సాధికారత జరిగిందని అన్నారు. రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఎమ్మెల్యేగా సంజీవయ్యను ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పండ్లూరు గ్రామ పంచాయితీ సర్పంచ్ రాజేశ్వరమ్మ, మాజీ సర్పంచ్ అత్తికాయల శ్రీనివాసులు, నాయుడుపేట మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వైకాపా ప్రభుత్వంలోనే సమగ్ర అభివృద్ధి ఎన్నికల ప్రచారంలో కిషోర్ యాదవ్ వెల్లడి
Related Posts
పవన్ కల్యాణ్… మీకు అధికారులు సహకరించకపోవడం ఏంటి?
ఏపీ డిప్యూటీ సీఎం పరిస్థితి విచిత్రంగా ఉందన్న అంబటి రాంబాబుఅధికారంలో ఉన్నది మీరే కదా అంటూ వ్యాఖ్యలుఈ స్కాం నిజమైతే పౌరసరఫరాల శాఖ మంత్రి రాజీనామా చేయాలిసహకరించవద్దని చంద్రబాబు, లోకేశ్ ఏమైనా చెప్పారా అంటూ ప్రశ్నప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో తరచుగా పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న కాకినాడ పోర్టు తనిఖీ సందర్భంగా అధికారుల తీరుపైనా ఆగ్రహం వెలిబుచ్చారు.…
Read moreకాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు … అధికారుల నిర్లక్ష్యంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
–అధికారుల నిర్లక్ష్యంతో దేశభద్రతకు తీవ్ర ముప్పు—మొత్తం నెట్ వర్క్‌ను బ్రేక్‌డౌన్ చేస్తాం— పీడీఎస్ బియ్యంతో ఉన్న షిప్ సీజ్ చేయండిప్రభాతదర్శిని (అమరావతి – ప్రత్యేకప్రతినిధి): కాకినాడ పోర్టులో పట్టుబడిన అక్రమ రేషన్ బియ్యం సందర్భంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు. ఇక్కడ నుంచి ఇంత భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు…
Read more