ప్రభాతదర్శిని, (నెల్లూరు ప్రత్యేక-ప్రతినిధి):”మారకనే మారానంటాడు” అనే కవిత సంపుటి ను విక్రమ సింహపురి వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు తమ ఛాంబర్ లో ఆవిష్కరించారు. ప్రముఖ చరిత్రకారులు రాజనీతి శాస్త్ర ఆచార్యులు కవి కాంజీవరం రాధాకృష్ణ సామాజిక నైతిక విలువలను ప్రబోధిస్తూ రాసిన కవిత్వ సంపుటి “రాజనీతి శాస్త్ర ఆచార్యులు కవి కాంజీవరం రాధాకృష్ణ రచించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణ జరిగింది. విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ 87 ఏళ్లుగా మనసులో తన భావాలను కవితాత్మకంగా వ్యక్తం చేసిన ఈ కవిత్వ సంపుటిని అందరూ చదవాలని సామాజిక, అసమానతలను వ్యక్తంచేసిన ఈ కవిత్వ సంపుటిని అందరూ చదవాలని సామాజిక, అసమానతలను అంతరాలను తన అనుభవపూర్వకంగా కవీత్కరించిన రాధాకృష్ణగారు అభినందనీయులు అన్నారు. తెలుగు అధ్యయిన ఆచార్యులు డాక్టర్. సి. రాజారామ్ మాట్లాడుతూ సామాజికతను కవిత్వరూపంలో ఉంచిన ఈ కవిత్వం అందరినీ చదివిస్తుందని సమజానికి యదార్ధ ప్రతిబింబంగా ఈ కవిత్వం ఉందన్నారు. డాక్టర్ కె. సునీత మాట్లాడుతూ సామాజిక సమస్యలను ప్రతిబింబించే కవిత్వం ద్వారా సామాజిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు తెలుగు అధ్యయన శాఖ ఆచార్యులు డాక్టర్ కే లక్ష్మీనారాయణ రెడ్డి ప్రసంగిస్తూ నేటితరం పాఠకులకు అర్థమయ్యేలా చిన్న చిన్న పదాలలో గొప్ప అర్ధాన్నిస్తూ రాసిన ఈ కవిత్వం భావితరాలకు సైతం ఆదర్శనీయమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యయన శాఖ ఆచార్యులు డాక్టర్ వి. వెంకటేశ్వర్లు, పాలిటెక్నిక్ కళాశాల ఆచార్యులు ఆకుపాటి సుధీర్, విశ్రాంత తెలుగు ఆచార్యులు కంచి నీరద హైకోర్టు న్యాయవాది, సీనియర్ జర్నలిస్టు, డాక్టర్ లెనిన్ ధనిసేటి తదితరులు పాల్గొన్నారు కవి కాంజీవరం రాధాకృష్ణ తన కవిత్వ సంపుటిలోని కవితలను స్వయంగా చదివి వినిపించారు.