ప్రభాతదర్శిని, (మెదక్-ప్రతినిధి): మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బొల్లెబోయిన స్వామి (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని అతని భార్య ప్రియుడితో కలసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. శుక్రవారం తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ రంగాకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. గత నెల 23న నేరెళ్లకుంటలో అనుమానాస్పద స్థితిలో స్వామి డెడ్‌బాడీ కనిపించగా, తన భర్త సర్పంచ్ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి వెళ్లి మద్యం తాగి వచ్చాడని, ఉదయం నుంచి ఇంట్లో కనిపించడం లేదని భార్య మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్ట్‌మార్టంలో డెడ్‌బాడీపై గాయాలు కనిపించడంతో పోలీసులు మౌనికను అదుపులోకి తీసుకొని విచారించారు. మౌనికకు కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన వీరప్పగారి సంపత్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. మూడు నెలల కింద గ్రామంలో పంచాయితీ పెట్టి మౌనికను మందలించారు. దీంతో అతడిని చంపాలని నిర్ణయించుకున్న మౌనిక మద్యం తాగి వచ్చి స్వామి పడుకోగా, సంపత్ ను పిలిపించి ఇద్దరు కలిసి హత్య చేశారు. అనంతరం డెడ్‌బాడీని సంపత్ బైక్ పై తీసుకెళ్లి గ్రామ శివారులోని నేరెళ్లకుంటలో పడేశాడు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.