తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులకు అపార్ నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లాలోని డిఈఓ, ఎంపిడిఓ లు, డిప్యూటీ ఈఓలు , ఎంఈఓ లతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నూతన విద్యా విధానం -2020 లో భాగంగా భారత ప్రభుత్వo ఒకే దేశం, ఒకే స్టూడెంట్ కార్డు పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కాలశాలలోని విద్యార్థులకు అపార్ (ఆటోమెటెడ్ పర్మనెంట్ అకాడమీ అకౌంట్ రిజిస్ట్రీ ) నమోదు కార్యక్రమం ప్రవేశ పెట్టిందని దీని ద్వారా విద్యార్థులకు ప్రత్యేక 12 అంకెలు గల గుర్తింపు కార్డును అందించనున్నదని దీనితో విద్యార్థులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్డు ద్వారా విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, జెండర్, క్యూఆర్ కోడ్, 12 అంకెలతో కూడిన గుర్తింపు కార్డు నంబర్ అన్నీ కలిపి డిజిటల్ రూపంలో భద్రపరచడం జరుగుతుందని , విద్యార్థులు దేశంలో ఎక్కడైనా చదువుకునే వెసులుబాటు కలుగుతుందని, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రవేశ పరీక్షల వివరాలు నమోదు, దృవీకరణ సులభం అవుతుందని తెలిపారు. ఈ కార్డు ద్వారా విద్యార్థుల అకాడమిక్ సమాచారం, విద్యార్థులు చదువుకునే విధానం, విద్యార్థి సాదించిన మార్కులు, గ్రేడ్లు, ఉపకార వేతనాలు, క్రీడల్లో సాధించిన అంశాలు , డిజిటల్ లాక్ ద్వారా ఆన్లైన్లో అనుసంధానమై ఉండటంతో సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం, విద్యార్థుల సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల వారి డేట్ అఫ్ బర్త్, పేరులో తప్పులుంటే జనన ధ్రువీకరణ పత్రం ఆధారంగా సరి చేసుకోవచ్చు. ప్రభుత్వ విద్యాలయాలలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు పదో తరగతి మార్క్స్ లిస్ట్ ఆధారంగా ప్రైవేట్ విద్యాలయాలలో చదివే విద్యార్థులకు స్థానిక ఎంఈఓ గాని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ధ్రువీకనాధారంగా తప్పు ఒప్పులు ఉన్న సర్టిఫికెట్లను సరిద్దుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ అపార్ నమోదు కార్యక్రమాన్ని నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని, ప్రతి ఒక్క విద్యాసంస్థలు సహకరించి విద్యార్థులకు అపార్ నమోదు చేయించాలని అలాగే సంబందిత ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు సహరించకపోతే చర్యలు ఉంటాయని, నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఈ వీడియో కన్ఫెరెన్స్ నందు డిఈఓ, డెప్యూటీఈవో, ఎంపిడి ఓలు, ఎంఈఓ లు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అపార్ నమోదు వేగవంతంగా పూర్తి చేయాలి
Related Posts
ఏ.సి.బి వలకు చిక్కిన అవినీతి అనకొండ
మాటువేసి వేసి పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభాతదర్శిని,(ఒంగోలు -ప్రతినిధి):గత ప్రభుత్వ హయాంలో తిలా పాపం, తలా పిడికెడు అనే ధోరణిలో విధులు నిర్వహించి ప్రజలను పట్టి పీడించిన పలువురు ప్రభుత్వ అధికారులపై ప్రజలతో బాటు, ప్రజా ప్రతినిధులు సైతం కన్నేసి ఉన్నారు.ఇందులో భాగంగా అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ ఉన్న పలువురు ప్రభుత్వ అధికారుల భరతం పట్టేందుకు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూ…
Read moreBC లోని ప్రస్తుతం కులాలు
BC- A కులాలు : . 1.అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడ బలిజ, బెస్త, జాలరి, గంగవారు, గంగపుత్ర, గూండ్ల, వన్యకుల క్షత్రియ, వన్నెకాపు, వన్నెరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి, నెయ్యల, పట్టపు, ముదిరాజు, ముత్రాసి తెనుగోళ్ళు బాలసంతు, బహురూపి 3. బండార 4. బుడబుక్కల 5. రజక, చాకలి, వన్నార్. 6. దాసరి 7. దొమ్మర 8.గంగిరెద్దుల 9. జంగం10. జోగి 11. కాటిపాపల 12. కొర్చ 13.…
Read more