రైతన్నలకు అండగా ఉంటా, వారికోసం ఎంత దూరమైనా వస్తా:ఉదయగిరి ఎమ్మెల్యే
ప్రభాతదర్శిని (వింజమూరు-ప్రతినిధి): రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆయన హయాంలో రైతన్నలకు అన్ని విధాల లబ్ధి చేకూరింది అని రైతన్నలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శనివారం వింజమూరు మండల పరిధిలోని ఊటుకూరు గ్రామపంచాయతీ ఆర్ బి కే కార్యాలయం నందు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ రైతన్నలకు అండగా ఉంటానని వారి కోసం ఎంత దూరమైనా వస్తానని వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని రైతన్న లేకపోతే మనం లేమని వారి అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఉద్యాన శాఖ వారి సౌజన్యం తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏజీఎం సూర్యనారాయణ మేనేజర్స్ సాయిరాం సాయి కృష్ణ తేజ ఉద్యాన శాఖ డి హెచ్ ఓ సుబ్బారెడ్డి పిడి ఏపీ ఎమ్ ఐ పి డిఏఓ హెచ్ ఓ లు పాల్గొన్నారు. రైతులకు పామాయిల్ సాగుకు కంపెనీ మరియు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న రాయితీల గురించి వివరించారు. పామాయిల్ సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తున్నాయని రైతు రాజు కావాలంటే ఉద్యాన పంటల వైపు రైతులు మగ్గుచూపాలని తెలిపారు. మెట్ట ప్రాంత రైతులకు పామాయిల్ సాగు ఒక వరమని దీని ద్వారా సుమారు 50 సంవత్సరాలు వరకు ఆదాయం వస్తుందని తెలియజేశారు. కనుక ప్రతి రైతు పామాయిల్ సాగు చేయాలని తెలియజేశారు. అనంతరం ఊటుకూరుకు చెందిన నరేంద్ర అనే రైతు పొలంలో పామాయిల్ మొక్కను ఎమ్మెల్యే చేతుల మీదగా నాటారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి జిల్లా కార్యనిర్వహ కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ సీనియర్ నాయకులు గణపం సుదర్శన్ రెడ్డి జడ్పిటిసి సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి ఎంపీటీసీ సభ్యులు గవ్వలు మల్లికార్జున సర్పంచ్ రొడ్డ వెంగమ్మ వనిపెంట సుబ్బారెడ్డి జూపల్లి రాజారావు మద్దినేని నాగేశ్వరరావు మద్దినేని నరేంద్ర ఎస్.కె మహబూబ్ బాషా రైతులు తదితరులు ఉన్నారు.
రైతు బాంధవుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు: ఎమ్మెల్యే కాకర్ల సురేష్
Related Posts
ఏ.సి.బి వలకు చిక్కిన అవినీతి అనకొండ
మాటువేసి వేసి పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభాతదర్శిని,(ఒంగోలు -ప్రతినిధి):గత ప్రభుత్వ హయాంలో తిలా పాపం, తలా పిడికెడు అనే ధోరణిలో విధులు నిర్వహించి ప్రజలను పట్టి పీడించిన పలువురు ప్రభుత్వ అధికారులపై ప్రజలతో బాటు, ప్రజా ప్రతినిధులు సైతం కన్నేసి ఉన్నారు.ఇందులో భాగంగా అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ ఉన్న పలువురు ప్రభుత్వ అధికారుల భరతం పట్టేందుకు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూ…
Read moreసీనియర్ జర్నలిస్ట్ వెంకటేశులుకు సన్మానం
ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి -ప్రతినిధి):జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా సీనియర్ జర్నలిస్ట్, శ్రీకాళహస్తి నియోజకవర్గం “ప్రభాతదర్శిని-ప్రతినిధి” చెన్నూరు వెంకటేశులును నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్చి తలపా దామోదర్ రెడ్డి తన కార్యాలయంలో ఆదివారం ఘనంగా సన్మానించ్చారు. జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా ఆయన “ప్రభాతదర్శిని” నియోజకవర్గ ప్రతినిధి చెన్నూరు వెంకటేశులు ను ఘనంగా సన్మానించ్చారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కోసం పిసిసి అధ్యక్షురాలు…
Read more