నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ ఘనత టిడిపిదే ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని తెలుగు దేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కొనియాడారు. జిల్లా నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నర్తకి సెంటర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులను ఆర్థిక స్థితి గతులను గతంలో ఏ ప్రభుత్వం గుర్తించలేదని వారి అభివృద్ధికి సహకరించే విధంగా వారికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించిన ఘనత తెలుగు దేశం ప్రభుత్వానిదే అని అన్నారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ పాలాభిషేకం చేసి కూటమి ప్రభుత్వ అందిస్తున్న పథకాలను వివరించారు. ముఖ్యంగా నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణుల సంఘం నాయకులు టిడిపి ముఖ్య నేతలు పాల్గొన్నారు.