త్వరలో మాజీ ఎమ్మెల్యే పై చర్యలు తప్పవు విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం
ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి-ప్రతినిధి):శ్రీ కాళహస్తిలోని భూ అక్రమాలపై, భూ బకాసురులపై విచారణ నిరంతర ప్రక్రియ అని, రాజీవ్ నగర్ నుంచి భూ అక్రమాలపై విచారణ ప్రక్రియ మొదలు పెట్టామని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ అక్రమాలపై ఇప్పటికే విచారణ ప్రారంభించామన్నారు. అయితే అయితే కొన్ని విమర్శలు రావడంతో రాజీవ్ నగర్ పై విచారణ నిరంతర ప్రక్రియగా మారుస్తామని తెలిపారు. భూవివాదాలపై, అక్రమార్కులపై త్వరలో కొరడా ఝళిపిస్తామని, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే అస్తవ్యస్తంగా ఉన్న ఆలయపాలనను గాడిలో పెట్టామని, బీసీ హాస్టల్, బాలికల హాస్టల్ రూపు రేఖలు మార్చామని తెలిపారు. అలాగే గత ఐదేళ్లలో డ్రైనేజీ వ్యవస్థ అద్వానంగా మారిందని చెప్పారు. అందువల్ల మురికి కాలువలో సిల్టు తొలగింపు కార్యక్రమం చేపట్టమన్నారు.రాజీవ్ నగర్ లో రివర్ వ్యూ లో మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన కొత్త పట్టాలను రద్దు చేసి అర్హులకు అందిస్తామని చెప్పారు. 2004 – 2006 మధ్యలో ఇంటి పట్టాలు పొందిన వారు నేరుగా ఆర్డీవోను కలిసి వారి వివరాలనుతెలియజేయాలన్నారు. అటు టిడ్కో ఇల్లు, రాజీవ్ నగర్ లో ఇంటి పట్టాలన్న వారికి ఏదో ఒకచోట అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు. అలా కాకుండా ఒక్కో వ్యక్తి వద్ద ఐదు నుంచి పది ఇంటి పట్టాలు ఉంటే వారిని ఉపేక్షించేది లేదని తెలిపారు. అలాగే కొంతమంది ఇతరులకు అమ్ముకొని ఉంటే వాటిలో ఇల్లు కట్టి ఉంటే ఖచ్చితంగా కూల్చివేస్తామని హెచ్చరించారు. అలాగే దొంగ పట్టాలు కొని ఇల్లు కట్టి ఉంటే అలాంటి వారికి వారి నుంచి వడ్డీతో సహా వసూలు చేసి ఇస్తామని తెలిపారు. అలాగే గంజాయివిక్రయాలు చేసే వారిని,లాటరీ టికెట్లు అమ్మే వారి భరతం పడతామని హెచ్చరించారు. శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మరుగు దొడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయ ఆదాయాన్ని గణనీయంగా పెంచామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఆర్డీవో రవి శంకర్ రెడ్డి, తాహసిల్దార్ లక్ష్మీనారాయణలు కూడా ఉన్నారు.
రాజీవ్ నగర్ అక్రమాలపై విచారణ నిరంతరం ప్రక్రియ…భూ బకాసురులు వదిలే ప్రసక్తి లేదు
Related Posts
ఏ.సి.బి వలకు చిక్కిన అవినీతి అనకొండ
మాటువేసి వేసి పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభాతదర్శిని,(ఒంగోలు -ప్రతినిధి):గత ప్రభుత్వ హయాంలో తిలా పాపం, తలా పిడికెడు అనే ధోరణిలో విధులు నిర్వహించి ప్రజలను పట్టి పీడించిన పలువురు ప్రభుత్వ అధికారులపై ప్రజలతో బాటు, ప్రజా ప్రతినిధులు సైతం కన్నేసి ఉన్నారు.ఇందులో భాగంగా అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ ఉన్న పలువురు ప్రభుత్వ అధికారుల భరతం పట్టేందుకు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూ…
Read moreసీనియర్ జర్నలిస్ట్ వెంకటేశులుకు సన్మానం
ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి -ప్రతినిధి):జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా సీనియర్ జర్నలిస్ట్, శ్రీకాళహస్తి నియోజకవర్గం “ప్రభాతదర్శిని-ప్రతినిధి” చెన్నూరు వెంకటేశులును నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్చి తలపా దామోదర్ రెడ్డి తన కార్యాలయంలో ఆదివారం ఘనంగా సన్మానించ్చారు. జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా ఆయన “ప్రభాతదర్శిని” నియోజకవర్గ ప్రతినిధి చెన్నూరు వెంకటేశులు ను ఘనంగా సన్మానించ్చారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కోసం పిసిసి అధ్యక్షురాలు…
Read more