కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): మంత్రి నారా లోకేష్ రాజకీయాల్లోకొచ్చి ప్రజాసేవ చేయాలనుకునే యువతకు రోల్ మాడల్ అన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ మరియు టిడిపి జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్రతో కలిసి కోవూరు పట్టణంలోని బాలికల పాఠశాలలో శుక్రవారం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థినులకు సైకిళ్ళపంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విమర్శలను దీవెనలుగా మార్చుకుని లక్షలాది యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన నవ్యాంధ్ర ఆశాకిరణం నారా లోకేష్ అని కొనియాడారు. ఏడు కొండల వాడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆమె దీవించారు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చిత్ర పటంపై ధ్రువతారలా వెలుగుతున్న నారా లోకేష్ జన్మదినం రాష్ట ప్రజలకు, మనందరికీ పండుగ రోజుగా అభివర్ణించారు. 226 రోజుల్లో 3 వేల 132 కిలోమీటర్లు సాగిన యువగళం పాదయాత్ర లోకేష్ లో వున్న అసలైన పోరాట యోధుడిని ప్రపంచానికి పరిచయం చేసిందని కొనియాడారు. యువగళం పేరిట రాష్ట వ్యాప్తంగా 226 రోజులు పాదయాత్ర చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని యువనేత లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 8, 9 చదివే 226 మంది బాలికలకు సైకిల్స్ యివ్వడం చాలా సంతోషంగా వుందన్నారు. ఐటి మంత్రిగా విశాఖపట్నం నగరాన్ని భారతదేశపు ‘డిజిటల్ గేట్వే’ గా మార్చడంలో నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. తాత ఎన్టీఆర్ క్రమశిక్షణ, తండ్రి చంద్రబాబు నాయుడు రాజనీతి రెండూ పుణికి పుచ్చుకున్న నాయకుడిగా లోకేష్ ను ప్రశాంతి రెడ్డి అభివర్ణించారు. విద్యాశాఖను కేవలం పాఠాలకే పరిమితం చేయకుండా ఉపాధికి వారధిగా మారుస్తూ రాష్ట్ర దిశ దశ మార్చేందుకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు నాడు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టి ఐటీ విప్లవం తెస్తే.. నేడు లోకేష్ విశాఖలో డేటా సెంటర్లతో ఏఐ విప్లవానికి నాంది పలుకుతున్నారన్నారు. విద్యాశాఖను కేవలం పాఠాలకే పరిమితం చేయకుండా ఉపాధికి వారధిగా మారుస్తున్న మంత్రి లోకేష్ ను అభినందించారు. నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకను బాలికలకు సైకిళ్ళ పంపిణి అనే గొప్ప సేవ కార్యక్రమంగా మార్చిన ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. సైకిళ్ళు అందుకున్న విద్యార్థినులు జాగ్రత్తగా నడపాలని బాగా చదువుకుని రేపటి తరాన్ని నడిపించే నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలలో 8, 9 తరగతులు చదివే విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్ళు అందివ్వనున్నట్టు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మంత్రి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. ఉచితంగా సైకిళ్ళు గతంలో పాఠశాల మరియు హాస్టల్లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇన్వర్టర్, ఆర్ ఓ ప్లాంట్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలికల హైస్కూల్ హెడ్మాస్టర్ గిద్దలూరు సోఫియా, పెన్నాడెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాలరెడ్డి, జొన్నవాడ ఆలయ ఛైర్మెన్ తిరుమూరు సుధాకర్ రెడ్డి సర్పంచ్ యాకసిరి విజయమ్మ, ఎంపీపీ తుమ్మల పార్వతి, మండల పార్టీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి, యద్దలపూడి నాగరాజ, జిల్లా టిడిపి కార్యదర్శి యాకసిరి రమణమ్మ, స్థానిక నాయకులు చెరుకూరు మహేష్, ముసలి సుధాకర్, గాదిరాజు అశోక్, నాటకరాణి వెంకట్, బలరావు, బత్తల రమేష్, పెంచలయ్య, దారపనేని శ్రీనివాసులు నాయుడు, షేక్ ఫిరోజ్, తవికుమార్, సుజిత్, సాయితేజ తదితరులు పాల్గొన్నారు.

