ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాల రాజకీయాలు మొత్తం చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో ఎన్నడలేని విధంగా కుటుంబాల మధ్య నెలకు ఉన్న వర్గ అభిప్రాయ భేదాలు రాజకీయాలలో కలిసిపోవడంతో పరిస్థితులు నెలకొన్నాయి. కుమార్తె తండ్రితో పోరాటం చేస్తోంది! అన్నపై చెల్లెళ్ళు విమర్శలు కురిపిస్తున్నారు. మామపై అల్లుడు బాణాలు ఎక్కుపెట్టాడు! అన్నపై తమ్ముడు పోరాడుతున్నాడు! భర్త పై భార్య పోటీ చేస్తోంది! ఇవన్నీ వేరే వేరే అయితే వార్తలు కావు కానీ, అన్నీ ఒక పార్టీ లోనే కనిపిస్తున్నాయి! ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో కుటుంబ పోరు రచ్చకెక్కింది! ఈ రచ్చల వెనుక ఆ పార్టీ చూపించే బూచి పేరు చంద్రబాబు! కొందరి లెక్క ప్రకారం చంద్రబాబు మాత్రమే అన్నిటికి కారణం! పక్క పార్టీలో లుకలకలకు కూడా చంద్రబాబే కారణం! మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాయి! జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హైకోర్టు 500 పైగా మొట్టికాయలు వేసి ఉంటుంది! వీటన్నిటికీ కారణం చంద్రబాబే! ఆయా న్యాయమూర్తులను చంద్రబాబు ప్రభావితం చేసారనేది ఆ పార్టీ సకల శాఖల అనధికార మంత్రి చెబుతూ ఉంటారు! చెప్పిందే చెబుతూ ఉంటారు! మరి ఆ పెద్దాయన్ని జైలులో పెట్టినప్పుడు వీళ్ళంతా చెప్పినట్లు ఒక్క న్యాయమూర్తి కూడా సహకరించ లేదెందుకు అంటే జవాబు ఎవ్వరి దగ్గర ఉండదు! అంతే కాదు, రాష్ట్రంలో పరిశ్రమలు రాకపోవడానికి చంద్రబాబు కారణం! ఆంధ్ర నాట రోడ్లు సరిగా లేకపోవడానికి కూడా ఆయనే! మూడు రాజధానులు అందుబాటులోకి రాకపోవడం కూడా చంద్రబాబే! ఎక్కడైనా ప్రమాదం జరిగినా అది చంద్రబాబు చేయించిందే! వరదలు వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా చంద్రబాబు మాత్రమే కారణం! అదే పేదలకు మంచి జరిగితే, బటన్ నొక్కి డబ్బులు పంచితే మాత్రం అది ఆ దేవుడి ఆశీస్సులతో అక్క చెల్లెమ్మల దీవెనలతో జగన్ మాత్రమే చేస్తాడు, చేయగలడు! జగన్ మాత్రమే అక్కడ పేదల పక్షం! చంద్రబాబుకు పేదలంటే వారి దాయాదుల నుంచి యుద్ధాలు ఉన్నాయి! అందుకే ఆయనకు పేదలంటే పడదు! ఆస్థి తగాదాలు, భూ తగాదాలు ఉన్నాయి! అందుకే నిరుపేదలు అంటే పడదు! జగన్ కు మాత్రమే పేద వర్గాలు అంటే ప్రాణం! ఇలా ఉంటుంది రాష్ట్రంలో ప్రచారం! ఇప్పుడు ఈ కుటుంబ లొల్లి కూడా అంతే! ఎవరి ఇళ్లల్లో గొడవలు ఉన్నాయో చంద్రబాబుకు మాత్రమే తెలుసు! ఎన్నికల్లో ప్రచారం కోసం వాళ్ళందరిని వెతికి బయటకు తెచ్చి దగ్గరుండి వీడియోలు చేయించి జనంలోకి వదులుతున్నారు! చంద్రబాబుకు ఇక వేరే పనే లేదు! ఈ చిల్లర రాజకీయాలు మాత్రమే చేస్తాడు! ఇలా ప్రచారం చేస్తారు కొందరు. ఇప్పుడూ అంతే! కేశినేని నాని, కేశినేని చిన్ని విజయవాడ లో ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు! అంబటి రాంబాబు పై అల్లుడు దుమారం రేపుతూ వీడియో విడుదల చేశాడు! ముద్రగడ పద్మనాభం కు వ్యతిరేకంగా కుమార్తె క్రాంతి వీడియో జనంలోకి వదిలింది. యనమల బ్రదర్స్ విడిపోయారు. ఇలా ఎన్నో ఎన్నెన్నో! అన్నిటికి చంద్రబాబే అంటారు అక్కడ! అసలు జగన్ పై, అవినాష్ పై సొంత చెల్లెళ్ళు షర్మిల, సునీత విమర్శలపై విమర్శల బాణాలు దూస్తున్నారు! ఈ గొడవల్లో సతమతమై తల్లి విజయలక్ష్మి అమెరికా వెళ్లిపోయారు! సొంత చెల్లెలు, తల్లి కూడా ఆయన పాలనపై వ్యతిరేకంగా వున్నారు! వీటన్నిటికీ కారణం చంద్రవాబు స్కెచ్ అంటారు అలాగే ప్రచారం చేస్తారు ! ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ను పరిష్కరించడం కనిపించదు! ఆ సమస్యకు మూలం తెలుసుకోరు! క్షణాల్లో మరో ఆలోచన లేకుండా ఆ సమస్యకు కారణం చంద్రబాబు అని చెప్పి చేతులు దులిపేసుకుంటారు! ఎందుకంటే అక్కడ చంద్రబాబు పేరే జపం! చంద్రబాబు పేరే స్మరణ! చంద్రబాబు పేరే మంత్రం! ఇతర రాష్ట్రాల వారికి, దేశాల్లో వుండే తెలుగు వారికి చంద్రబాబు దార్శనికుడు! అభివృద్ధి, సంక్షేమం ఆయనకు మాత్రమే తెలుసు! ఆయన మాత్రమే చేయగలడు! కానీ, ఇక్కడ కొన్ని వర్గాలకు మాత్రం ఆయన ఒక రాక్షసుడు! అభివృద్ధిని అడ్డుకుని, సంక్షేమాన్ని ఆపేసే దుర్మార్గుడు అని ప్రచారం చేస్తారు ! ఆశ్చర్యం ఏమిటంటే జనం మాత్రం ఇప్పటి వరకు నమ్మారు!..ఇప్పుడుమారారు, బటన్ కాదు భవిషత్తు కావాలనుకుంటున్నారు, ఊహించనిరీతిలో సమాధానం సిద్ధం చేసుకున్నారు. ఆ సమాధానం ఎంత గట్టిగా ఉంటుందంటే , ఎవ్వరిఅంచనాలకు అందనంత!
రచ్చకెక్కుతున్న కుటుంబవర్గపోరు…. చంద్రబాబు చుట్టు ఏపీ ప్రతిపక్షరాజకీయాలు!…
Related Posts
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూత
ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ ప్రతినిధి): మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహా…
Read moreఏసీబీకి చిక్కిన డిప్యుటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి
ప్రభాతదర్శిని,(జగిత్యాల జిల్లా ప్రతినిధి):జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డిప్యుటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆఫిసోద్దీన్ 4,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పల్లెపునరేష్ అనే వ్యక్తి కథలాపూర్ మండలం ఇప్పపల్లి వద్ద మామిడి తోటలో చెట్లు కోస్తుండడంతో పర్మిషన్ నిమిత్తం అధికారులను సంప్రదించగా పదివేలు డిమాండ్ చేయడంతో…
Read more