ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి కొండాపురం మండలం యూనిట్ ఇంచార్జ్ యారం కృష్ణయ్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ విజయవాడలోని అను న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా తెలుగుదేశం నాయకులు ద్వారా సమాచారం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాస్పిటల్ కి వెళ్లి యారం కృష్ణయ్యని పరామర్శించి, ధైర్యంగా ఉండి వైద్యుల సలహా మేరకు మందులు వాడి త్వరగా కోలుకోవాలని తెలిపారు. గత ఆరు సంవత్సరాల క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్న యారం కృష్ణయ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి విజయవాడకు వెళ్లారు. ప్రమాణ స్వీకారం అనంతరం విజయవాడలో ఒక లాడ్జిలో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. అందుబాటులో ఉన్న కొండాపురం మండల కన్వీనర్ ఓంకారం ఇతర నాయకులు అత్యవసరంగా అను న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం కృష్ణయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
యారం కృష్ణయ్యను పరామర్శించి ఎమ్మెల్యే కాకర్ల సురేష్
Related Posts
సీఎంను కలిసిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్
ప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ):సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ముఖ్యమంత్రిని కలిసి ఒక రోజంతా ఉండే అవకాశాన్ని టిడిపి పార్టీ కల్పించింది. ఈ కాన్సెప్ట్ తో రూపొందించిన డే విత్ సిబిన్ కార్యక్రమంలో భాగంగా స్వీడన్ కు చెందిన (శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం)ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్ ను ముఖ్యమంత్రి తన ఇంటికి ఆహ్వానించారు. ఉదయం నుంచి…
Read moreపవన్ కల్యాణ్… మీకు అధికారులు సహకరించకపోవడం ఏంటి?
ఏపీ డిప్యూటీ సీఎం పరిస్థితి విచిత్రంగా ఉందన్న అంబటి రాంబాబుఅధికారంలో ఉన్నది మీరే కదా అంటూ వ్యాఖ్యలుఈ స్కాం నిజమైతే పౌరసరఫరాల శాఖ మంత్రి రాజీనామా చేయాలిసహకరించవద్దని చంద్రబాబు, లోకేశ్ ఏమైనా చెప్పారా అంటూ ప్రశ్నప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో తరచుగా పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న కాకినాడ పోర్టు తనిఖీ సందర్భంగా అధికారుల తీరుపైనా ఆగ్రహం వెలిబుచ్చారు.…
Read more