ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కి టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి సూటిగా ప్రశ్నలు సంధించారు. ఆరుసార్లు కోవూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యావని గొప్పలు చెప్పుకుంటున్న పర్సనల్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కనీస మౌలిక వసతులు కల్పించావా అంటూ ప్రశాంతి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంట్రాక్టుల వద్ద ప్రతిపనికి తీసుకుంటున్న కమిషన్ లో ఐదు శాతం ప్రజల కోసం వెచ్చించిన ఈ పార్టీకి కోవూరు నియోజకవర్గంలో మౌలికవసతులు కల్పించేవారని, ఆమె అన్నారు. ప్రజా సంక్షేమం అభివృద్ధిని విస్మరించిన ప్రసన్నకుమార్ రెడ్డిని ఈసారి ఎన్నికలలో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
కాంట్రాక్టర్ల వద్ద నుంచి ప్రసన్న వసూలు చేసిన కోట్లాది రూపాయల లంచాల్లో నుంచి 5 శాతం ప్రజా ప్రయోజనాల కోసం వెచ్చించినా గ్రామాల్లో రోడ్లు, తాగునీరు లాంటి మౌళిక సమప్యలు పరిష్కారం అయి వుండేవన్నారు కోవూరు ఎన్డిఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొడవలూరు మండలం రామన్నపాళెం గ్రామంలో జరిగిన ఎన్నికల పాల్గొన్న టిడిపి అభ్యర్థి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమం అభివృద్ధి కొరకు పాటు తెలిపారు. ఆరు సార్లు గెలిచామని గొప్పలు చెప్పుకునే ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగానే కోవూరు నియోజక వర్గంలో చాలా గ్రామాలు సమస్యల మయంగా మారాయన్నారు. ఎవరైన చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశాన వసతులు కూడా కల్పించలేని అసమర్ద ఎమ్మెల్యే ఆరు సార్లు గెలిచి సాధించింది ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోనికొస్తేనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో నిరుద్యోగ సమస్య సమూలంగా పరిష్కారం కావాలంటే పాలనా అనుభవం వున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యపడుతోందన్నారు.
వైసిపి ప్రభుత్వం రద్దు చేసిన అన్న క్యాంటీన్, రంజాన్ తోఫా, క్రిస్మస్ మరియు సంక్రాంతి కానుక లాంటి ఎన్నో జనరంజక పధకాలు తిరిగి
టిడిపి అధికారంలోకొచ్చాక తిరిగి కొనసాగిస్తామన్నారు. తాను మాటల మనిషిని కాదని ఎమ్మెల్యేగా గెలిచాక నిత్యం ప్రజలకు అందుబాటులో వుంటానన్నారు. ప్రత్యక్ష రాజకీయాలలోనికి రాక ముందే ప్రజాసేవలో వున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా తనను కోవూరు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రశాంతి రెడ్డి ఓటర్లను కోరారు.
మౌలిక వసతులు ఏవి?…ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం సాధించావు ప్రసన్న…గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటా…కోవూరు టిడిపి అభ్యర్థి ప్రశాంత రెడ్డి
Related Posts
“మానవత”చే భూరి విరాళం – ప్రత్యేక ప్రతిభావంతులకు సాయం
శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయంప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ప్రత్యేక ప్రతిభావంతులకు విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ( శైలజ)కు తిరుపతి మానవత శాఖ, రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబు చే ఒక నెలకు సరిపడే బియ్యం, పప్పు ధాన్యాలు, ముడి సరుకులను ఉచితంగా అందజేశారు. సోమవారం వికృతమాల సమీపం ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్…
Read moreలంచాల కోసం వేధిస్తున్న ‘ఓజిలి రెవెన్యూ’ అధికారులు
మీడియా ముందు గోడువెళ్ళబోసుకున్న రైతు ప్రభాతదర్శిని,(ఓజిలి-ప్రతినిధి): ఓజిలి మండల రెవెన్యూ అధికారులు లంచాల కోసం వేధిస్తున్నారని రైతు దయాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో తన గోడును వెళ్ళబో సుకున్నారు. తనకు ఓజిలి మండలం రుద్రాయ పాలెం గ్రామంలో ఏడు ఎకరాల పట్టా భూములు ఉన్నాయని తెలిపారు. రీ సర్వే పేరుతో 7 ఎకరాల భూమిని 30 పేర్లతో గందరగోళం చేశారని తెలిపారు. పట్టా ఒక…
Read more