ప్రభాతదర్శిని (ఒంగోలు-ప్రతినిధి): ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం లోని మోటుమాలలో ఉన్న కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక సభ్య సమాజం తలదించు కునేలా ప్రసవించిన సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర0లో చెందిన భద్రాచలం కు చెందిన గంగారాణి ఆమె కుటుంబ సభ్యులతో ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మర్రి చెట్ల పాలెం వద్ద నివాసం ఉంటుంది. గంగారాణి కుమార్తె పదవ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవరపాలెం లో పూర్తిచేసుకుని ఆన్లైన్ దరఖాస్తు ద్వారా కొత్తపట్నం మండలం మోటుమాల కేజీబీవీ లో ఇంటర్మీడియట్ బైపిసి ప్రథమ సంవత్సరం చదువుతుంది. జూన్ 19 వ తేదీన కేజీబీవీ లో జాయిన్ అయి 26 వ తేదీ వరకు ఉండి తిరిగి ఇంటికి వెళ్ళింది. మరల జూలై 11 వ తేదీ కేజీబీవీ కి హాజరై 31 జూలై వరకు ఉన్నది. కేజీబీవీ లో ఇంటర్ ప్రవేశము పొందిన దగ్గర నుండి కేవలము 26 రోజులు మాత్రమే ఉన్నట్లు సమాచారం. బువారం ఉదయం 10:30 సమయంలో బాత్రూం కు వెళ్లిన విద్యార్థిని తలుపు వేసుకొని ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి సిబ్బంది ప్రిన్సిపాల్ కు సమాచారం తెలపడంతో స్పందించిన ప్రిన్సిపల్ అరుణకుమారి వెంటనే బాత్రూం వద్దకు వచ్చి పక్క రూములో కుర్చీ పైకి ఎక్కించి చూడగా అప్పటికే ప్రసవించిన మగ శిశువును మృతి చెంది ఉండడం, బాత్రూం తలుపు వెనక పెట్టడాన్ని గమనించారు. విషయాన్ని సమగ్ర శిక్ష జి సి డి ఓ కు తెలిపారు. ఆమె జిల్లా విద్యాశాఖ అధికారికి తెలపడంతో సదరు డిఇఓ జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించినట్లు తెలిసింది. స్పందించిన జిల్లా కలెక్టర్ అన్సారి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఐసిడిఎస్ పిడి గా విధులు నిర్వహిస్తున్న మాధురిని నివేదిక అందించాలని ఆదేశించినట్లు సమాచారం అందింది. దీంతో కదిలిన జిల్లా యంత్రాంగం కేజీబీవీ కి చేరుకొని వాస్తవ పరిస్థితులను గమనించి బాలికను కొత్తపట్నం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రెండవ పట్టణ సీఐ జగదీష్ కొత్తపట్నం ఎస్సై సాంబ శివరావు చికిత్స పొందుతున్న బాలికను ప్రాథమిక విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్య చికిత్స కోసం 108 లో ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. సదరు బాలికకు గర్భిణీ రావడానికి ప్రధానంగా చీమకుర్తి మండలం మర్రిచెట్టు పాలెం వద్ద నివసిస్తున్న ముగ్గురు వ్యక్తులు కారణమని బాలిక ప్రాథమిక విచారణలో తెలిపినట్లు సమాచారం. తొలుత ఒక ముస్లిం వ్యక్తితో పరిచయంగా మాట్లాడు తుండడం చూసి అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి బాలికను బెదిరించి లోబరుచుకొని ఆమెతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించినట్లు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది. వైద్యుల పరిశీలనలో పదవ తరగతి పరీక్షలు జరుగుతూ ఉన్నప్పుడే సదరు బాలిక బాలిక మూడో నెల గర్భం ధరించి ఉంటుందని పేర్కొన్నారు. సదరు శ్రీనివాస్ రెడ్డికి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. పోలీసుల విచారణలో బాలిక పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించలేదని తెలిసింది., నా ఇష్టం మీరెవరు నన్ను అడగటానికి అని ఎదిరించినట్లు కూడా తెలిసింది. బాలిక బాల్ బ్యాట్మెంటన్ , డిస్క్ త్రోలో రాష్ట్రస్థాయి అవార్డులు పొందినట్లు కూడా సమాచారం. దీనిపై రెండవ పట్టణ సిఐ జగదీష్ ను విలేకరులు అడగగా ఈ కేసు చీమకుర్తి మండలానికి సంబంధించిందని అక్కడ అధికారులు చూసు కుంటారని, కేజీబీవీ లో జరిగిన విషయం మాత్రమే మన మండల పరిధిలో వస్తుందని ఆయన తెలిపారు.
మోటుమాల కేజీబీవీ లో ఇంటర్ బాలిక ప్రసవం…. వైద్యం అందక మరణించిన మగ శిశువు….
Related Posts
సీఎంను కలిసిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్
ప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ):సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ముఖ్యమంత్రిని కలిసి ఒక రోజంతా ఉండే అవకాశాన్ని టిడిపి పార్టీ కల్పించింది. ఈ కాన్సెప్ట్ తో రూపొందించిన డే విత్ సిబిన్ కార్యక్రమంలో భాగంగా స్వీడన్ కు చెందిన (శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం)ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్ ను ముఖ్యమంత్రి తన ఇంటికి ఆహ్వానించారు. ఉదయం నుంచి…
Read moreపవన్ కల్యాణ్… మీకు అధికారులు సహకరించకపోవడం ఏంటి?
ఏపీ డిప్యూటీ సీఎం పరిస్థితి విచిత్రంగా ఉందన్న అంబటి రాంబాబుఅధికారంలో ఉన్నది మీరే కదా అంటూ వ్యాఖ్యలుఈ స్కాం నిజమైతే పౌరసరఫరాల శాఖ మంత్రి రాజీనామా చేయాలిసహకరించవద్దని చంద్రబాబు, లోకేశ్ ఏమైనా చెప్పారా అంటూ ప్రశ్నప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో తరచుగా పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న కాకినాడ పోర్టు తనిఖీ సందర్భంగా అధికారుల తీరుపైనా ఆగ్రహం వెలిబుచ్చారు.…
Read more