ప్రభాతదర్శిని (న్యూఢిల్లీ-ప్రతినిధి): వచ్చే నెలాఖరుకల్లా ఆధార్‌తో పాన్ అనుసంధానం పూర్తయితే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ తెలియజేసింది. ఐటీ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ ఆధార్‌తో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) లింక్ అవ్వకపోతే సాధారణంగా వర్తించే రేటుకు రెండింతల టీడీఎస్ మినహాయింపులుంటాయి. కాగా, లావాదేవీ సమయంలో పాన్ ఇన్ఆపరేటివ్లో ఉన్న ట్యాక్స్‌పేయర్లకు టీడీఎస్/టీసీఎస్ షార్ట్ డిడక్షన్/కలెక్షన్ ఎగవేతకు పాల్పడ్డారన్న నోటీసులు వస్తున్నట్టు సీబీడీటీ తెలిపింది. ఈ మేరకు తమకు పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు అందాయని పేర్కొన్నది. అయితే అలాంటి కేసుల్లో మే 31కల్లా ఆధార్‌తో పాన్ అనుసంధానం కాకపోయినా సాధారణ రేటుకే టీడీఎస్/టీసీఎస్ వసూలుంటుందని సీబీడీటీ స్పష్టం చేసింది. 2022 జూన్ 30 వరకు ఆధార్‌తో పాన్ అనుసంధానం ఉచితంగానే జరిగింది. జూలై 1 నుంచి 2023 జూన్ 30 వరకు రూ.1,000 ఆలస్య రుసుముతో అనుమతించారు. అప్పటికీ లింక్ అవ్వని పాన్ జూలై 1 నుంచి ఇన్‌ఆపరేటివ్‌లోకి వెళ్లింది. దీన్ని ఆపరేషన్లోకి తేవాలంటే రూ.1,000 ఫైన్ కట్టాల్సిందే. కానీ 30 రోజుల సమయం పడుతుంది. ఆధార్, పాన్ లింక్ కాకపోతే ఐటీ రిఫండ్ ఉండదు. లింక్ చేసుకుంటే రిఫండ్ వస్తుంది. కానీ, ఆలస్యానికి ఐటీ శాఖ నుంచి వడ్డీ రాదు.
మే 31 కల్లా ఆధార్ తో పాన్ లింక్ అవ్వాలి…అలాగైతేనే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం చర్యలుండవ్..
Related Posts
వి.ఎస్.యు. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ అధికారులకు జిల్లా స్థాయి ప్రశంస పత్రాలు
ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి):జిల్లాలో వివిధ విభాగాల్లో విశేషమైన సేవలు అందించిన ఉద్యోగులను 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ప్రశంసిస్తూ జిల్లా స్థాయి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ అవార్డుకు వి.ఎస్.యు ఎన్.ఎస్.ఎస్.కి చెందిన 5 ప్రోగ్రామ్ అధికారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా, ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు ప్రశంసా పత్రాలను అందుకున్న ప్రోగ్రామ్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ, “జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.)…
Read moreక్రీడలు శారీరిక మానసిక ఉల్లాసానికి అవసరం
ఇంటర్-కాలేజియేట్ టోర్నమెంట్ ముగింపులో ఎస్వీయూ వైస్ ఛాన్సలర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): క్రీడలు మానసిక ఉల్లాసానికి అవసరమని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ విజయభాస్కరరావు అన్నారు. వెంకటాచలం మండలం కాకుటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఇంటర్‌కాలేజియేట్ పురుషుల క్రీడల టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్లో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు…
Read more