పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణివిద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. పాలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసారు. మధ్యాహ్నం భోజనంను స్వయంగా రుచి చూసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ 10వ తరగతి 100 శాతం ఉత్తీర్ణత సాధించాలన్నాటు. సబ్జెక్టు బాగా నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి ఉపయోగం ఉంటుందని విద్యార్థులకు ఆమె సూచించారు. మధ్యాహ్నం భోజనం పథకం మెనూ బోర్డులను పరిశీలించి మెనూ ప్రకారం భోజనాలు విద్యార్థులకు అందించాలన్నారు. ప్రస్తుతం వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నందున పిల్లలు ఆరోగ్య అలవాట్లను పాటించాలని సూచించారు. భోజనం ముందు తరువాత చేతులను శుభ్రపరుచు కోవాలని తెలిపారు. మెనూ ప్రకారం వంటలు తయారు చేసారా లేదా అని పరిశీలించడమే కాకుండా వడ్డించిన పదార్థాలను నిశితంగా పరిశీలించారు. విద్యార్దులతో కలసి సహపంక్తి భోజనం చేసారు. రోజువారీ తయారు చేసే వంటలు గురించి విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అందరూ పాఠశాలలో తప్పక మధ్యాహ్న భోజనం చేయాలని తెలిపారు. గుడ్డు, చిక్క, రాగి జావ తప్పకుండా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరిశుభ్రమైన నీటితో వంటలు చేయాలని, త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని ఆదేశించారు. వర్షాకాలం కనుక వంట దగ్గర, వడ్డించే దగ్గర, బోజనం చేయు ప్రదేశం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ప్రధానోపాద్యాయుడు పి.మహేశ్ బాబును ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. జిల్లా కలెక్టర్ పాఠశాలను సందర్శించిన సందర్భంలో విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ, మద్యాహ్న భోజన జిల్లా కో ఆర్డివీటర్లు కె.కృష్ణారావు, జి.చిన్నియ్య, మండల విద్యాశాఖ అధికారి పి.నాగరాజు, ఉప విద్యాశాఖాధికారి ఎన్. శ్రీనివాస్. బీమవరం ఎంఈఓ 2, సీఆర్పీలు అన్నపూర్ణ, వెంకటేశ్వరరావు, తదితరులు ఉన్నారు.
మెరుగైన విద్యా బోధనతోపాటు నాణ్యమైన ఆహారం అందించాలి
Related Posts
ఏ.సి.బి వలకు చిక్కిన అవినీతి అనకొండ
మాటువేసి వేసి పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభాతదర్శిని,(ఒంగోలు -ప్రతినిధి):గత ప్రభుత్వ హయాంలో తిలా పాపం, తలా పిడికెడు అనే ధోరణిలో విధులు నిర్వహించి ప్రజలను పట్టి పీడించిన పలువురు ప్రభుత్వ అధికారులపై ప్రజలతో బాటు, ప్రజా ప్రతినిధులు సైతం కన్నేసి ఉన్నారు.ఇందులో భాగంగా అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ ఉన్న పలువురు ప్రభుత్వ అధికారుల భరతం పట్టేందుకు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూ…
Read moreBC లోని ప్రస్తుతం కులాలు
BC- A కులాలు : . 1.అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడ బలిజ, బెస్త, జాలరి, గంగవారు, గంగపుత్ర, గూండ్ల, వన్యకుల క్షత్రియ, వన్నెకాపు, వన్నెరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి, నెయ్యల, పట్టపు, ముదిరాజు, ముత్రాసి తెనుగోళ్ళు బాలసంతు, బహురూపి 3. బండార 4. బుడబుక్కల 5. రజక, చాకలి, వన్నార్. 6. దాసరి 7. దొమ్మర 8.గంగిరెద్దుల 9. జంగం10. జోగి 11. కాటిపాపల 12. కొర్చ 13.…
Read more