మాచవరం సర్పంచ్ భర్త పై టిడిపి నాయకులు దాడి

ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): తమ నివాస ప్రాంతం వద్ద మురికి నీరు పోయిద్దు అని అన్నందుకు ఆగ్రహించి మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన ఓజిలి మండలం మాచవరం గ్రామంలో చోటు చేసుకుంది. వైఎస్ఆర్ సీపీ సర్పంచ్ పిండుకూరు మౌనికా రెడ్డి భర్త పిండుకూరు మధుసూదన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ నాయకులు కక్షపూరితంగా ఆదివారం మధ్యాహ్నం దాడికి పాల్పడ్డారు. బాధితుడి వివరాల మేరకు మాచవరం గ్రామంలో పిండుకూరు మధుసూదన్ రెడ్డి ఇంటి పక్కనే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు తాతినేని సుమంత్ మురికి నీళ్లు వదులుతూ ఉన్నాడు. గత కొద్దిరోజుల నుంచి మురికి నీళ్లు వదల వద్దని పలుమార్లు చెప్పిన పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. మురికి నీటిని తమ ఇంటిపై ఎందుకు వదులుతున్నావని మధుసూదన్ రెడ్డి సుమంతను ప్రశ్నించాడు. దీంతో సుమంత్ కోపోద్రిక్తుడై మధుసూదన్ రెడ్డి పై రాయితో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో మధుసూదన్ రెడ్డి పెదవులు ఘాట్లు ఏర్పడి అతని చొక్కా రక్త మండలం అయింది. అనంతరం వారి కుటుంబ సభ్యులు కూడా మధుసూదన్ రెడ్డి పై దాడి చేసి గాయపరిచారు. అనంతరం మధుసూదన్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ చేరుకుని దాడి విషయము తెలియజేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.