ప్రభాతదర్శిని ( శ్రీకాళహస్తి-ప్రతినిధి ): శ్రీకాళహస్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల పార్థసారథి , మాజీ టౌన్ బ్యాంక్ వైస్ పులి రామచంద్రయ్య లు దేవి నవరాత్రుల సందర్బంగా స్థానిక భాస్కర పేట చాముండేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద వారికి గతంలో వున్న ఆర్థిక లావాదేవీల కారణంగా కొన్ని సంవత్సరాలుగా ఇరువురి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంది.దీంతో వారు అమ్మవారిని దర్శించుకుని వస్తున్న సమయంలో పరస్పరం వివాదం చోటు చేసుకుంది. దీంతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు.అయితే వారిద్దరూ గత ప్రభుత్వంలో ఇరువురు మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉంటూ ఉండడం విశేషం, ఈ సందర్భంలో వీరి ఆర్థిక లావాదేవీల పంచాయతీ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దృష్టికి రావడం, వారి పంచాయతీ తీర్చలేక ఎవరికీ న్యాయం చేయలేకపోవడంతో పరస్పర వ్యక్తి గత దూషణలు, కోర్టుకేసులు జరుగుతున్నాయి. అటు పిమ్మట 2024 సార్వత్రిక ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీలోపార్థసారథి చేరారు.ఈ చేరికను ప్రస్తుత శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్యఅనుచరులు తీవ్రంగా వ్యతిరేకించడం విశేషం. ఈ నేపథ్యంలో భాస్కర పేట చాముండేశ్వరి అమ్మవారి ఆలయం వద్దకు దర్శనం నిమిత్తం మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల పార్థసారథి వచ్చారు. ఈ సందర్భంలో అమ్మవారి గర్భాలయంలో కుటుంబ సమేతంగా ఉన్న మాజీ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ పులి రామచంద్ర దంపతులు ఒకరికి ఒకరు ఎదురు పడడం అదేవిధంగా చామండేశ్వరి ఆలయ చైర్మన్ గా వైసీపీ నేత మాజీ కౌన్సిలర్ చల్లా జయరామయ్యను ఎన్నిక చేయడంలో ముత్యాల పార్థసారథి కీలకంగా వ్యవహరించారని అందుకు పులి రామచంద్రయ్య వర్గం ఆలయ చైర్మన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ఉండడం, భాస్కర్ పేటలో కొంతకాలంగా వీరు ఇరువురు మధ్య వర్గ పోరు జరుగుతూ ఉంది ఈ సందర్భంలో ఒకప్పుడు రామలక్ష్మణులు,ఇప్పుడు దాయాదుల వలే కర్రలు,రాళ్లు, పోరకలు,పాదరక్షలతో పరస్పర దాడులు చేసుకొని పండుగ పర్వదినాన అమ్మవారి భక్తులు భయభ్రాంతులతో పరుగులు తీశారు.
ముత్యాల పార్థసారధి – పులి రామచంద్ర బాహాబాహి
Related Posts
అట్టహాసంగా ప్రారంభమై… అంగరంగ వైభవంగా… ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు
ముగింపు కార్యక్రమ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, మంత్రి అనగాని సత్యప్రసాద్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమాలు జిల్లాలో అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, పర్యాటక రంగ అభివృద్ధికి, సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇది మంచి ప్రభుత్వం అని మూడవ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమ ముగింపు వేడుకలకు రాష్ట్ర…
Read moreఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కి తరలి వస్తున్న ప్రజలు పర్యాటక ప్రేమికులు
ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ప్రజల్ని పర్యాటకులను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలుఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వస్తున్న విద్యార్థులు, ప్రజలు, పర్యాటకులుజన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణంవివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత ప్రభాతదర్శిని ( సూళ్లూరుపేట-ప్రతినిధి ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 రెండవ రోజు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులలో కిక్కిరిసిన జనం కేరింతలతో ఉత్సాహంగా…
Read more