ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఈనెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిల్లకూరు మండలం, తూర్పు కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆ దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు చిల్లకూరు దాశరధరామిరెడ్డి, కార్యానిర్వహాధికారి కొమ్మలపూడి నవీన్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆలయ చైర్మన్ చిల్లకూరు దశరథ రామిరెడ్డి, ఆలయ ఈవో కొమ్మలపూడి నవీన్ కుమార్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా ఈనెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. ముత్యాలమ్మ జాతరను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని, ఈ జాతరకు ఆంధ్ర, తెలంగాణ , తమిళనాడు ,కేరళ, కర్ణాటక పలు రాష్ట్రాల నుండి లక్షలాదిగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కలు తీర్చుకుంటారని పేర్కొన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలకు గురికాకుండా సౌకర్యంగా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. అమ్మవారి జాతరను గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పూర్తి సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

అమ్మవారి జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు: చిల్లకూరు ఎస్సై సురేష్ బాబు:ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా జరిగే ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు లక్షలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతరలో పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ దేవస్థానం పాలకమండలి కమిటీ సభ్యులు మేకల కుమార్, మునిశేఖర్ గౌడ్, పూజారి శివప్రసాద్ తదితర సభ్యులు పాల్గొన్నారు.