ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. శుక్రవారం నెల్లూరు పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారులు నిర్వహించారు. నామినేషన్ల పరిశీలన అనంతరం నెల్లూరు పార్లమెంటు పరిధిలో మొత్తం 21 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.15 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి 25 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురైంది.24 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. కావలి అసెంబ్లీ నియోజకవర్గానికి 25 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 15 ఆమోదం పొందాయి.10 తిరస్కరణకు గురయ్యాయి. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 15 మంది అభ్యర్థులకు గాను ఇద్దరు నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, 13 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. కోవూరు నియోజకవర్గానికి సంబంధించి 28 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా, 9 మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, 19 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. నెల్లూరు సిటీ కి సంబంధించి 26 మంది నామినేషన్లు దాఖలు చేయగా 18 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. 8 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నెల్లూరు రూరల్ కు సంబంధించి 13 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది.12 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 17 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా నాలుగు తిరస్కరణకు, 13 ఆమోదం పొందాయి. ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 22 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 16 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి.